వలవని జోలింక వద్దనరే । తన
(॥పల్లవి॥)
వలవని జోలింక వద్దనరే । తన-
తలఁపులోన నేఁదగిలితిని
(॥వల॥)
పిలువరె పిలువరె ప్రియునీ తా-
నలిగి యలిగి కడ నరిగీనా
తెలిసినవే తనతెగువలూ నే
నలుగడ నిందుకు నవ్వితినే
(॥వల॥)
అడుగరె యడుగరె యతనీ నేఁ
దొడరిపట్టినాఁదొలఁగీని
విడువుమనవె తనవిద్యలూ తా
బడిబడి నిందు కె భ్రమసితినే
(॥వల॥)
తలఁగరె తలఁగరె దగ్గరీ నేఁ
గలసిన తా నిఁకఁ గాదనునా
అలరెను శ్రీవేంకటాధిపుఁడూ నా
యిలు చొచ్చి కలసె నెఱిఁగితి నేను
(||pallavi||)
valavani joliṁka vaddanare | tana-
talam̐pulona nem̐dagilidini
(||vala||)
piluvarĕ piluvarĕ priyunī tā-
naligi yaligi kaḍa narigīnā
tĕlisinave tanadĕguvalū ne
nalugaḍa niṁdugu navvidine
(||vala||)
aḍugarĕ yaḍugarĕ yadanī nem̐
dŏḍaribaṭṭinām̐dŏlam̐gīni
viḍuvumanavĕ tanavidyalū tā
baḍibaḍi niṁdu kĕ bhramasidine
(||vala||)
talam̐garĕ talam̐garĕ daggarī nem̐
galasina tā nim̐kam̐ gādanunā
alarĕnu śhrīveṁkaḍādhibum̐ḍū nā
yilu sŏchchi kalasĕ nĕṟim̐gidi nenu