Valavamgalattellaa valasinadi

వలవఁగలట్టెల్లా వలచినది
Language

(॥పల్లవి॥)
వలవఁగలట్టెల్లా వలచినది
కలసిమెలసి యిట్టె కరుణించవయ్యా

(॥వల॥)
చిగురుఁబెదవులనుఁ జెప్పీ నీకుఁ బ్రియములు
మగువ నింతటనైనా మన్నించవయ్యా
నిగిడి అపటనుండి నిలిచి కొలువుసేసీ
అగడుసేయనేల ఆదరించవయ్యా

(॥వల॥)
చక్కనిమోమెత్తి నిన్నుసారె సారెకునుఁ జూచీ
చెక్కులునొక్కి చనవు చెల్లించవయ్యా
మొక్కుతానే నీతో మొలకనవ్వులు నవ్వీ
యిక్కువలంటి లాలించి యీడేర్చవయ్యా

(॥వల॥)
కొమలపుఁ జేతులను కోరి నీకు విడెమీచ్చీ
ప్రేమ నందుక కాఁగిట బిగించవయ్యా
కామించి శ్రీవేంకటేశ నీమనసు దక్కఁగొనె
వేమరు రతుల నింకా వెలయించవయ్యా

(||pallavi||)
valavam̐galaṭṭĕllā valasinadi
kalasimĕlasi yiṭṭĕ karuṇiṁchavayyā

(||vala||)
sigurum̐bĕdavulanum̐ jĕppī nīgum̐ briyamulu
maguva niṁtaḍanainā manniṁchavayyā
nigiḍi abaḍanuṁḍi nilisi kŏluvusesī
agaḍuseyanela ādariṁchavayyā

(||vala||)
sakkanimomĕtti ninnusārĕ sārĕgunum̐ jūsī
sĕkkulunŏkki sanavu sĕlliṁchavayyā
mŏkkudāne nīdo mŏlaganavvulu navvī
yikkuvalaṁṭi lāliṁchi yīḍersavayyā

(||vala||)
kŏmalabum̐ jedulanu kori nīgu viḍĕmīchchī
prema naṁduga kām̐giḍa bigiṁchavayyā
kāmiṁchi śhrīveṁkaḍeśha nīmanasu dakkam̐gŏnĕ
vemaru radula niṁkā vĕlayiṁchavayyā