Valavagumdunaa neegu valaraajagurum ditte

వలవకుండునా నీకు వలరాజగురుఁ డిట్టె
Language

(॥పల్లవి॥)
వలవకుండునా నీకు వలరాజగురుఁ డిట్టె
యెలమి నీ సొబగులు యివి నీకె దక్కెను

(॥వల॥)
కట్టిన బొమ్మల పట్టు కన్నె చంద్రవంక బొట్టు
మెట్టిన పాదాల మీద మెరసేగుట్టు
పట్టిన సేవంతిజొంపముల పూవులబంతి
నెట్టిన యీ సింగారాలు నీకే యమరునే

(॥వల॥)
వీడెపు మోవికప్పు విరులు జారేటికొప్పు
తోడనే కాటుకకనుదోయి చొప్పు
వేడుకై చెంపల మునివేళ్ళ నలఁదినవొప్పు
యీడులేని వొయ్యారము యివి నీకె తగునే

(॥వల॥)
చిలుగువాఁడి చూపు చెలికత్తె మూవు దాపు
తలకొన్న నవ్వుల తరితీవు
యెలమి శ్రీ వేంకటేశుఁడితఁడు గడినయేపు
యిలపైఁ గలకాలము యింతా నీకె చెల్లునే

(||pallavi||)
valavaguṁḍunā nīgu valarājagurum̐ ḍiṭṭĕ
yĕlami nī sŏbagulu yivi nīgĕ dakkĕnu

(||vala||)
kaṭṭina bŏmmala paṭṭu kannĕ saṁdravaṁka bŏṭṭu
mĕṭṭina pādāla mīda mĕraseguṭṭu
paṭṭina sevaṁtijŏṁpamula pūvulabaṁti
nĕṭṭina yī siṁgārālu nīge yamarune

(||vala||)
vīḍĕbu movigappu virulu jāreḍigŏppu
toḍane kāḍugaganudoyi sŏppu
veḍugai sĕṁpala muniveḽḽa nalam̐dinavŏppu
yīḍuleni vŏyyāramu yivi nīgĕ tagune

(||vala||)
siluguvām̐ḍi sūbu sĕligattĕ mūvu dābu
talagŏnna navvula taridīvu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍidam̐ḍu gaḍinayebu
yilabaim̐ galagālamu yiṁtā nīgĕ sĕllune