Valava kettumdune neevamka soosi ramanumdu

వలవ కెట్టుండునే నీవంక చూచి రమణుఁడు
Language

(॥పల్లవి॥)
వలవ కెట్టుండునే నీవంక చూచి రమణుఁడు
నిలువెల్లా ఇంతేసి నించుకొన్నదానవు

(॥వల॥)
పలికితే మాఁటలను పచ్చితేనియులు గారీ
పొలసితే మెరుఁగులే పోగునియ్యీని
కులికి చూచితేను కుంకుమలే తొలఁగీని
నెలఁతరో నీ వెందు నేరుచుకొంటివే

(॥వల॥)
నవ్వితేను సెలవుల నంటున ముత్యాల రాలీ
రవ్వఁగా గొసరితేను రంజించీని
చివ్వన జంకించితేను చీఁకట్లు గదిమీని
జవ్వనిరో నీ వెంత జాణవైతివే

(॥వల॥)
వొరసితేఁ జన్నులను వుదిరి బంగారు రాలీ
మొరసితేఁ జిందీని మోహరసాలు
సిరుల నన్నేలినాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
తరుణిదో యెన్నెన్ని చేఁతల వెలసితివే

(||pallavi||)
valava kĕṭṭuṁḍune nīvaṁka sūsi ramaṇum̐ḍu
niluvĕllā iṁtesi niṁchugŏnnadānavu

(||vala||)
paligide mām̐ṭalanu pachchideniyulu gārī
pŏlaside mĕrum̐gule poguniyyīni
kuligi sūsidenu kuṁkumale tŏlam̐gīni
nĕlam̐taro nī vĕṁdu nerusugŏṁṭive

(||vala||)
navvidenu sĕlavula naṁṭuna mutyāla rālī
ravvam̐gā gŏsaridenu raṁjiṁchīni
sivvana jaṁkiṁchidenu sīm̐kaṭlu gadimīni
javvaniro nī vĕṁta jāṇavaidive

(||vala||)
vŏrasidem̐ jannulanu vudiri baṁgāru rālī
mŏrasidem̐ jiṁdīni moharasālu
sirula nannelinām̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
taruṇido yĕnnĕnni sem̐tala vĕlasidive