వలచుటే దోసమా వనిత నీ కాతఁడు
(॥పల్లవి॥)
వలచుటే దోసమా వనిత నీ కాతఁడు
నలువంక మరి యేఁటినవ్వులు నవ్వేవే
(॥వల॥)
పంతమెల్ల నీమాటపట్టులోననే వున్నది
చింతలెల్ల నీచెక్కుచేత నున్నవి
వింతలిన్నియును నీనివ్వెరుగులలో నున్నవి
యెంతకెంత పతి నింకా యేఁటికి దూరేవే
(॥వల॥)
బిగువెల్ల నిపుడు నీపెదవులపై నున్నది
తెగువలు నీకన్నులతేట నున్నవి
అగడింతా నీపొలయలుకలలో నున్నది
యెగసక్కే లాతని నేఁటికి నాడేవే
(॥వల॥)
గబ్బితనమెల్లాను నీకాఁగిటిలోనే వున్నది
నిబ్బరము నీవుండేటినీటులో నున్నది
అబ్బురమై శ్రీవేంకటాధీశుఁడు నిన్నుఁ గూడె
వుబ్బున నీతనికెంత వొరటులు చూపేవే
(||pallavi||)
valasuḍe dosamā vanida nī kādam̐ḍu
naluvaṁka mari yem̐ṭinavvulu navveve
(||vala||)
paṁtamĕlla nīmāḍabaṭṭulonane vunnadi
siṁtalĕlla nīsĕkkuseda nunnavi
viṁtalinniyunu nīnivvĕrugulalo nunnavi
yĕṁtagĕṁta padi niṁkā yem̐ṭigi dūreve
(||vala||)
biguvĕlla nibuḍu nībĕdavulabai nunnadi
tĕguvalu nīgannuladeḍa nunnavi
agaḍiṁtā nībŏlayalugalalo nunnadi
yĕgasakke lādani nem̐ṭigi nāḍeve
(||vala||)
gabbidanamĕllānu nīgām̐giḍilone vunnadi
nibbaramu nīvuṁḍeḍinīḍulo nunnadi
abburamai śhrīveṁkaḍādhīśhum̐ḍu ninnum̐ gūḍĕ
vubbuna nīdanigĕṁta vŏraḍulu sūbeve