Valasinattu seyu naavallam gala guna midi

వలసినట్టు సేయు నావల్లఁ గల గుణ మిది
Language

(॥పల్లవి॥)
వలసినట్టు సేయు నావల్లఁ గల గుణ మిది
నలినాక్ష నీ తలఁపు నాకేమిఁ దెలియదు

(॥వలసి॥)
యెన్నఁగా నా పురాకృత మెఱుఁగఁ గాని యొక్కట
నిన్ను నేఁ గొలిచితి ననే గర్వ మెఱుఁగుదు
మున్ను నే నుండే స్వభావము దలఁచఁ గాని నీవు
మన్నించే యహంకారము మదిలోఁ దలఁతును

(॥వలసి॥)
నేరని నా చేఁతలు నే నెంతైనా నెంచఁ గాని
పేరిటివాఁడ ననేటి పెద్దఱిక మెంతును
మోరతోపున నా మర్మములు చెప్పుకొనఁ గాని
సారె వైష్ణవుఁడ ననే సలిగ చెప్పుదును

(॥వలసి॥)
యిమ్ముల నేఁ గొంచపడే దెవ్వరికిఁ జూపఁ గాని
నమ్మి నీ మఱుఁగు చొచ్చిన బలిమి చూపుదు
పమ్మి న న్నింతసేసిన పాపముఁ బొగడఁ గాని
నెమ్మది శ్రీవేంకటేశ నిన్నే పొగడుదును

(||pallavi||)
valasinaṭṭu seyu nāvallam̐ gala guṇa midi
nalinākṣha nī talam̐pu nāgemim̐ dĕliyadu

(||valasi||)
yĕnnam̐gā nā purākṛta mĕṟum̐gam̐ gāni yŏkkaḍa
ninnu nem̐ gŏlisidi nane garva mĕṟum̐gudu
munnu ne nuṁḍe svabhāvamu dalam̐sam̐ gāni nīvu
manniṁche yahaṁkāramu madilom̐ dalam̐tunu

(||valasi||)
nerani nā sem̐talu ne nĕṁtainā nĕṁcham̐ gāni
periḍivām̐ḍa naneḍi pĕddaṟiga mĕṁtunu
moradobuna nā marmamulu sĕppugŏnam̐ gāni
sārĕ vaiṣhṇavum̐ḍa nane saliga sĕppudunu

(||valasi||)
yimmula nem̐ gŏṁchabaḍe dĕvvarigim̐ jūbam̐ gāni
nammi nī maṟum̐gu sŏchchina balimi sūbudu
pammi na nniṁtasesina pābamum̐ bŏgaḍam̐ gāni
nĕmmadi śhrīveṁkaḍeśha ninne pŏgaḍudunu