వలసినట్టాడవయ్య వన్నెలెల్లాఁ జూపవయ్య
(॥పల్లవి॥)
వలసినట్టాడవయ్య వన్నెలెల్లాఁ జూపవయ్య
నిలువెల్లా మెఱుఁగులే నీకు మొక్కఁజాలదు
(॥॥)
మగువ మాటాడఁబోతే మాణికేలు రాలీని
జగడాలు నీతోను సారె నోపదు
మొగమెత్తి చూడఁబోతే మొల్లలే మిక్కుటమయ్యీ
నగవు లంతేసి నీతో నవ్వఁగనోపదు
(॥॥)
అంగన నడవఁగానే అందెలెల్లా మొరసీని
వెంగలినీవినయాలు వినఁగూడదు
కుంగక కాఁగిటిలోన కుచములే పెరిగీని
చెంగటఁ జేయివట్టినాఁ జెలియ మొగియదు
(॥॥)
పొలఁతి నిన్నొరసితే పులకలు రాసివడీ
వొలిసియు నిందుకేపో వూరకున్నది
అలరి శ్రీవేంకటేశ అంగన నీవు గూడఁగా
నిలిచినపరవశాన నివ్వెరగుఁ బొందెను
(||pallavi||)
valasinaṭṭāḍavayya vannĕlĕllām̐ jūbavayya
niluvĕllā mĕṟum̐gule nīgu mŏkkam̐jāladu
(||||)
maguva māḍāḍam̐bode māṇigelu rālīni
jagaḍālu nīdonu sārĕ nobadu
mŏgamĕtti sūḍam̐bode mŏllale mikkuḍamayyī
nagavu laṁtesi nīdo navvam̐ganobadu
(||||)
aṁgana naḍavam̐gāne aṁdĕlĕllā mŏrasīni
vĕṁgalinīvinayālu vinam̐gūḍadu
kuṁgaga kām̐giḍilona kusamule pĕrigīni
sĕṁgaḍam̐ jeyivaṭṭinām̐ jĕliya mŏgiyadu
(||||)
pŏlam̐ti ninnŏraside pulagalu rāsivaḍī
vŏlisiyu niṁdugebo vūragunnadi
alari śhrīveṁkaḍeśha aṁgana nīvu gūḍam̐gā
nilisinabaravaśhāna nivvĕragum̐ bŏṁdĕnu