వలసినప్పుడు నేనే వచ్చేఁగాని
(॥పల్లవి॥)
వలసినప్పుడు నేనే వచ్చేఁగాని
చలివేఁడి సరసాలు చాలుఁజాలు నేలయ్య
(॥వల॥)
అంటిఁబో మాతెరువురా కాకెవద్ద నుండుమని
నంటున నూరకె మాతోనవ్వేవుగాని
యింటికేల వచ్చితివి యెన్నటి కెన్నటిపొందు
రంట దెప్పరములేల రాకురాకు పోవయ్యా
(॥వల॥)
సెలవిచ్చితిఁబో నీకు చెల్లినట్టె సేయుమని
వెలినుండే నన్ను గారవించేవుగాని
అలుకేల తేర్చేవు ఆనలేల పెట్టేవు
బలువుఁడ వన్నిటాను పదపద యిఁకను
(॥వల॥)
మొక్కితిఁబో యిప్పుడిట్టె మోహించి కూడినందుకు
చెక్కునొక్కి నన్ను ఱట్టు సేసేవుగాని
అక్కరతో శ్రీవేంకటేశ ఆయము లే లంటేవు
చొక్కొతి నన్నిటా నన్నుఁ జూడుచూడు మిఁకను
(||pallavi||)
valasinappuḍu nene vachchem̐gāni
salivem̐ḍi sarasālu sālum̐jālu nelayya
(||vala||)
aṁṭim̐bo mādĕruvurā kāgĕvadda nuṁḍumani
naṁṭuna nūragĕ mādonavvevugāni
yiṁṭigela vachchidivi yĕnnaḍi kĕnnaḍibŏṁdu
raṁṭa dĕpparamulela rāgurāgu povayyā
(||vala||)
sĕlavichchidim̐bo nīgu sĕllinaṭṭĕ seyumani
vĕlinuṁḍe nannu gāraviṁchevugāni
alugela tersevu ānalela pĕṭṭevu
baluvum̐ḍa vanniḍānu padabada yim̐kanu
(||vala||)
mŏkkidim̐bo yippuḍiṭṭĕ mohiṁchi kūḍinaṁdugu
sĕkkunŏkki nannu ṟaṭṭu sesevugāni
akkarado śhrīveṁkaḍeśha āyamu le laṁṭevu
sŏkkŏdi nanniḍā nannum̐ jūḍusūḍu mim̐kanu