Valasinappudu neeve vachchevu gaanee

వలసినప్పుడు నీవే వచ్చేవు గానీ
Language

(॥పల్లవి॥)
వలసినప్పుడు నీవే వచ్చేవు గానీ
మలసి యందాఁకా నిది మఱవకుండు మనే

(॥॥)
వెలఁది నీ కొకమాట విన్నవించి రమ్మనె
తలఁపు లోపల నుండి దాఁగకు మని
తెలిపి రమ్మనె మరీఁ దేటతెల్లమిగాను
చలము లందులో మరీ సాదించకు మనుచు

(॥॥)
యిక్కువ నింకా నొక టెఱిఁగించి రమ్మనె
అక్కడనే సరసమూ నాడుమనీ
మొక్కి యెఱుకగా కొంగు ముడివేసి రమ్మనె
గక్కన మనోరథాలఁ గౌఁగిలించు మనుచు

(॥॥)
యెదుటఁ దారుకాణగా నెచ్చరించి రమ్మనే
యెదలో నైనా రతుల నెనయు మనీ
అదన శ్రీ వేంకటేశ అంతలో వచ్చికూడితి
విదివో తనతో వీ విరవైతి వనుచూ

(||pallavi||)
valasinappuḍu nīve vachchevu gānī
malasi yaṁdām̐kā nidi maṟavaguṁḍu mane

(||||)
vĕlam̐di nī kŏgamāḍa vinnaviṁchi rammanĕ
talam̐pu lobala nuṁḍi dām̐gagu mani
tĕlibi rammanĕ marīm̐ deḍadĕllamigānu
salamu laṁdulo marī sādiṁchagu manusu

(||||)
yikkuva niṁkā nŏga ṭĕṟim̐giṁchi rammanĕ
akkaḍane sarasamū nāḍumanī
mŏkki yĕṟugagā kŏṁgu muḍivesi rammanĕ
gakkana manorathālam̐ gaum̐giliṁchu manusu

(||||)
yĕduḍam̐ dārugāṇagā nĕchchariṁchi rammane
yĕdalo nainā radula nĕnayu manī
adana śhrī veṁkaḍeśha aṁtalo vachchigūḍidi
vidivo tanado vī viravaidi vanusū