Valasinappudu memu vachchemugaani

వలసినప్పుడు మేము వచ్చేముగాని
Language

(॥పల్లవి॥)
వలసినప్పుడు మేము వచ్చేముగాని
మలసి మమ్మీవేళ మన్నించరయ్యా

(॥వల॥)
తరుణిచిత్తము నీతలఁపు కొలఁదే కాక
యెరవుల మామాట యేఁటికయ్యా
వొరసి బుద్దులు చెప్పి వొకరి వారముగాము
మరిగి వుండేరు మీరే మరి మేమేలయ్యా

(॥వల॥)
అంగన చలము మీ అలుకకోలఁదే కాక
సంగతిగాని నూపొందు చాలునయ్యా
వెంగలిచేఁతల మొక్కి విదిలింపించుకొంటిమి
ముంగిటనుండేము మాతో మొగమోటేలయ్యా

(॥వల॥)
వనితప్రియము నీవలపు కొలఁదే కాక
తనిసితిమి మానీటు దక్కెనయ్యా
చనవున మీకు మీకే చక్కనై కూడితిరిదే
ననిచి శ్రీవేంకటేశ నవ్వు నవ్వేమయ్యా

(||pallavi||)
valasinappuḍu memu vachchemugāni
malasi mammīveḽa manniṁcharayyā

(||vala||)
taruṇisittamu nīdalam̐pu kŏlam̐de kāga
yĕravula māmāḍa yem̐ṭigayyā
vŏrasi buddulu sĕppi vŏgari vāramugāmu
marigi vuṁḍeru mīre mari memelayyā

(||vala||)
aṁgana salamu mī alugagolam̐de kāga
saṁgadigāni nūbŏṁdu sālunayyā
vĕṁgalisem̐tala mŏkki vidiliṁpiṁchugŏṁṭimi
muṁgiḍanuṁḍemu mādo mŏgamoḍelayyā

(||vala||)
vanidapriyamu nīvalabu kŏlam̐de kāga
tanisidimi mānīḍu dakkĕnayyā
sanavuna mīgu mīge sakkanai kūḍidiride
nanisi śhrīveṁkaḍeśha navvu navvemayyā