వలచినందుకు నిటువంటిదా గురి
(॥పల్లవి॥)
వలచినందుకు నిటువంటిదా గురి
తలపోసి నీమోము తప్పక చూచెను
(॥వల॥)
నగవులు నీతో నవ్వి నాటకములెల్లాఁజేసి
తగుల నిన్నుఁదిట్టెఁగా తరుణి
మొగమోటించుకలేక ముంగోప మెట్లఁజూపె
వెగటుగ నాకిందుకు వెరగయ్యీ నేఁడు
(॥వల॥)
మచ్చిక నీపైఁ జల్లి మంచిమాటలెల్లనాడి
పచ్చిసేసేఁగా నిన్ను పడఁతి
రచ్చల నవ్వేరనక రాజస మెట్లఁ జూపె
తచ్చి నీమోము చూచి దయవుట్టీ నాకు
(॥వల॥)
కన్నులనే సన్నసేసీ కాఁగిట బిగించి కూడి
నిన్నునలయించెఁగా నెలఁత
యిన్నిటా శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి
కన్నె నిన్నుయెట్టు మెచ్చె కతడిగె నిపుడు
(||pallavi||)
valasinaṁdugu niḍuvaṁṭidā guri
talabosi nīmomu tappaga sūsĕnu
(||vala||)
nagavulu nīdo navvi nāḍagamulĕllām̐jesi
tagula ninnum̐diṭṭĕm̐gā taruṇi
mŏgamoḍiṁchugalega muṁgoba mĕṭlam̐jūbĕ
vĕgaḍuga nāgiṁdugu vĕragayyī nem̐ḍu
(||vala||)
machchiga nībaim̐ jalli maṁchimāḍalĕllanāḍi
pachchisesem̐gā ninnu paḍam̐ti
rachchala navveranaga rājasa mĕṭlam̐ jūbĕ
tachchi nīmomu sūsi dayavuṭṭī nāgu
(||vala||)
kannulane sannasesī kām̐giḍa bigiṁchi kūḍi
ninnunalayiṁchĕm̐gā nĕlam̐ta
yinniḍā śhrī veṁkaḍeśha yīḍa nannum̐ gūḍidivi
kannĕ ninnuyĕṭṭu mĕchchĕ kadaḍigĕ nibuḍu