(॥పల్లవి॥)
వలచినదానికేలే వాసులెంచను
సెలవుల నవ్వుతాను చేకొనఁగవలదా
(॥॥)
పిలువఁగా నీవేల బిగిసేవే పతితోను
చలము లెందాఁకాను సాదించేవే
బలిమి నాతఁడు నిన్ను పైకొని చెనకఁగాను
కలువకన్నులఁ జూచి కాఁగిలించవలదా
(॥॥)
వొడిపట్టి తియ్యఁగాను వొరటు లింకానేలే
బడివాయకుండఁగాను పంతమేఁటికే
ఆడియాలముగ మోవి యాతఁడు నీకియ్యఁగాను
తడివి మోవి యొసఁగి దప్పి దేర్చవలదా
(॥॥)
ముందుముందె మాటాడఁగా మోసము నీకిపుడేలే
కందువ నిన్నుఁ గూడఁగ కాఁతాళమేలే
చెంది యలమేల్మంగవు శ్రీవేంకటేశుఁ డతఁడు
పొందైతి రిట్లానే భోగించవలదా
(||pallavi||)
valasinadānigele vāsulĕṁchanu
sĕlavula navvudānu segŏnam̐gavaladā
(||||)
piluvam̐gā nīvela bigiseve padidonu
salamu lĕṁdām̐kānu sādiṁcheve
balimi nādam̐ḍu ninnu paigŏni sĕnagam̐gānu
kaluvagannulam̐ jūsi kām̐giliṁchavaladā
(||||)
vŏḍibaṭṭi tiyyam̐gānu vŏraḍu liṁkānele
baḍivāyaguṁḍam̐gānu paṁtamem̐ṭige
āḍiyālamuga movi yādam̐ḍu nīgiyyam̐gānu
taḍivi movi yŏsam̐gi dappi dersavaladā
(||||)
muṁdumuṁdĕ māḍāḍam̐gā mosamu nīgibuḍele
kaṁduva ninnum̐ gūḍam̐ga kām̐tāḽamele
sĕṁdi yalamelmaṁgavu śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu
pŏṁdaidi riṭlāne bhogiṁchavaladā