Valasinadaani kimta vaasulemcha nunnadaa

వలచినదాని కింత వాసులెంచ నున్నదా
Language

(॥పల్లవి॥)
వలచినదాని కింత వాసులెంచ నున్నదా
యెలయ నీవే పతికి విడెమియ్యఁ గదవే

(॥వల॥)
సెలవుల నవ్వితేనే సిగ్గులు వడుదురా
అలమి చన్నులు చేత నంటితేఁగాక
పిలిచినంతటిలోనె పెనఁగులాడుదురా
తిలకించి కొంగువట్టి తీసితేఁగాక

(॥వల॥)
సన్నలు సేసితేనే సణఁగులాడుదురా
వున్నతితోఁ గొనగోర నూఁదితేఁగాక
కన్నులఁ జూచితేనే కాఁకలఁ దిట్టుదురా
పన్ని నే మర్మాలు సోఁక బలికితేఁగాఁక

(॥వల॥)
పచ్చడము గట్టితేనే పక్కన నలతురా
కొచ్చి సదమదముగాఁ గూడితేఁగాక
ఇచ్చ నిన్ను శ్రీవేంకటేశుఁడేలె మీరుదురా
అచ్చపుటలమేల్మంగ వారడైతేఁగాక

(||pallavi||)
valasinadāni kiṁta vāsulĕṁcha nunnadā
yĕlaya nīve padigi viḍĕmiyyam̐ gadave

(||vala||)
sĕlavula navvidene siggulu vaḍudurā
alami sannulu seda naṁṭidem̐gāga
pilisinaṁtaḍilonĕ pĕnam̐gulāḍudurā
tilagiṁchi kŏṁguvaṭṭi tīsidem̐gāga

(||vala||)
sannalu sesidene saṇam̐gulāḍudurā
vunnadidom̐ gŏnagora nūm̐didem̐gāga
kannulam̐ jūsidene kām̐kalam̐ diṭṭudurā
panni ne marmālu som̐ka baligidem̐gām̐ka

(||vala||)
pachchaḍamu gaṭṭidene pakkana naladurā
kŏchchi sadamadamugām̐ gūḍidem̐gāga
ichcha ninnu śhrīveṁkaḍeśhum̐ḍelĕ mīrudurā
achchabuḍalamelmaṁga vāraḍaidem̐gāga