Valasinadaani kemdu vaadu selladu

వలచినదాని కెందు వాదు చెల్లదు
Language

(॥పల్లవి॥)
వలచినదాని కెందు వాదు చెల్లదు
బలువులే చూపవయ్య బాస దప్ప దిఁకను

(॥వల॥)
వేడుకకు వెలలేదు వెన్నెల కెంగిలిలేదు
ఆడిక నీచేఁతలకు నడ్డములేదు
వీడె మిందవయ్య నీవిద్యలెల్ల లోఁగొంటి
వోడ కిట్టె నవ్వవయ్య వొరయ నిన్నిఁకను

(॥వల॥)
మరునికి వేళలేదు మాయలకు గురిలేదు
వరుస నీకూటాలకు వావిలేదు
సరుగ మో విందవయ్య చనవెల్లఁ జేకొంటి
తెరలోనికి రావయ్య తెగ నీకు నిఁకను

(॥వల॥)
చిగురుకు చేఁగలేదు సిగ్గులకు తప్పులేదు
తగు నీయాసోదానకు తనివిలేదు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నేనూఁ గూడితిమి
మొగమెత్తి చూడవయ్య మొక్కే నేనిఁకను

(||pallavi||)
valasinadāni kĕṁdu vādu sĕlladu
baluvule sūbavayya bāsa dappa dim̐kanu

(||vala||)
veḍugagu vĕlaledu vĕnnĕla kĕṁgililedu
āḍiga nīsem̐talagu naḍḍamuledu
vīḍĕ miṁdavayya nīvidyalĕlla lom̐gŏṁṭi
voḍa kiṭṭĕ navvavayya vŏraya ninnim̐kanu

(||vala||)
marunigi veḽaledu māyalagu guriledu
varusa nīgūḍālagu vāviledu
saruga mo viṁdavayya sanavĕllam̐ jegŏṁṭi
tĕralonigi rāvayya tĕga nīgu nim̐kanu

(||vala||)
sigurugu sem̐galedu siggulagu tappuledu
tagu nīyāsodānagu taniviledu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nenūm̐ gūḍidimi
mŏgamĕtti sūḍavayya mŏkke nenim̐kanu