Valasinadaanam gaana vadine lonaidim gaaga

వలచినదానఁ గాన వడినే లోనైతిఁ గాక
Language

(॥పల్లవి॥)
వలచినదానఁ గాన వడినే లోనైతిఁ గాక
అలుగఁ దగదా నీతో నలుగలేఁ గాక

(॥వల॥)
ఆడనుండి యెడమాఁట లాడించినప్పుడే నిన్నుఁ
గూడకుండఁదగదా నే గూడితిఁగాక
మేడపై నెవ్వతెతోనో మేలఁమాడఁగా నిన్నుఁ
జూడకుండఁదగదా నే జూచితిఁగాక

(॥వల॥)
తలఁచిననప్పుడే రాక తడసినప్పుడే నిన్ను
పిలువకుండఁ దగదా నేఁ బిలుతుఁగాక
బలిమి నావొద్దనుండి బహుపరాకైనప్పుడే
కంయకుండఁదగదా నేఁ గలసితిఁ గాక

(॥వల॥)
మిగుల నన్నుఁ గూడి మేనుమఱచినప్పుడే
నగకుండఁదగదా నే నగితిఁగాక
చిగురుమేనితుమ్మలూరిచెన్నుఁడా శ్రీవేంకటేశ
తగఁ బంతమిచ్చితే దక్కి మెచ్చితిఁగాక

(||pallavi||)
valasinadānam̐ gāna vaḍine lonaidim̐ gāga
alugam̐ dagadā nīdo nalugalem̐ gāga

(||vala||)
āḍanuṁḍi yĕḍamām̐ṭa lāḍiṁchinappuḍe ninnum̐
gūḍaguṁḍam̐dagadā ne gūḍidim̐gāga
meḍabai nĕvvadĕdono melam̐māḍam̐gā ninnum̐
jūḍaguṁḍam̐dagadā ne jūsidim̐gāga

(||vala||)
talam̐sinanappuḍe rāga taḍasinappuḍe ninnu
piluvaguṁḍam̐ dagadā nem̐ biludum̐gāga
balimi nāvŏddanuṁḍi bahubarāgainappuḍe
kaṁyaguṁḍam̐dagadā nem̐ galasidim̐ gāga

(||vala||)
migula nannum̐ gūḍi menumaṟasinappuḍe
nagaguṁḍam̐dagadā ne nagidim̐gāga
sigurumenidummalūrisĕnnum̐ḍā śhrīveṁkaḍeśha
tagam̐ baṁtamichchide dakki mĕchchidim̐gāga