Valasina yamganala vaamdavu gaaga

వలచిన యంగనల వాఁడవు గాక
Language

(॥పల్లవి॥)
వలచిన యంగనల వాఁడవు గాక
తలఁచి నీ చిత్తములో దానఁ జుమ్మీ నేనూ

(॥॥)
యే సతిఁ బెండ్లాడినా ని న్నెట్టు వెంగే లాడవచ్చు
వాసితో నాపెను నావంటిదే కాదా
వోసరించ కప్పటి నీ వొడి వట్ట నెట్టు వచ్చు
బాసతో నీ వొక్కతె పాలఁ జిక్కితివా

(॥॥)
నీ వెవ్వతెతో నవ్వినా నిన్నెట్టు మానుపవచ్చు
ఆ వనిత నోము ఫల మట్లుండఁగా
కావించి నీ కెటువలె కంకణము గట్ట వచ్చు
చేవ మీర నీ వొకతె చేతిలోని వాఁడవా

(॥॥)
యెందరిఁ దెచ్చుకొనినా యే మనఁ గవచ్చు నిన్ను
అంది నీ కింతా లాభమై యుండుఁ గాకా
యిందరిలో శ్రీ వేంకటేశ నన్నేలితివి
కందువ దొరికితి వొక్కతె కబ్బేవాఁడవా

(||pallavi||)
valasina yaṁganala vām̐ḍavu gāga
talam̐si nī sittamulo dānam̐ jummī nenū

(||||)
ye sadim̐ bĕṁḍlāḍinā ni nnĕṭṭu vĕṁge lāḍavachchu
vāsido nābĕnu nāvaṁṭide kādā
vosariṁcha kappaḍi nī vŏḍi vaṭṭa nĕṭṭu vachchu
bāsado nī vŏkkadĕ pālam̐ jikkidivā

(||||)
nī vĕvvadĕdo navvinā ninnĕṭṭu mānubavachchu
ā vanida nomu phala maṭluṁḍam̐gā
kāviṁchi nī kĕḍuvalĕ kaṁkaṇamu gaṭṭa vachchu
seva mīra nī vŏgadĕ sediloni vām̐ḍavā

(||||)
yĕṁdarim̐ dĕchchugŏninā ye manam̐ gavachchu ninnu
aṁdi nī kiṁtā lābhamai yuṁḍum̐ gāgā
yiṁdarilo śhrī veṁkaḍeśha nannelidivi
kaṁduva dŏrigidi vŏkkadĕ kabbevām̐ḍavā