Valasina valavellaa vadi neege nelavu

వలచిన వలవెల్లా వడి నీకే నెలవు
Language

(॥పల్లవి॥)
వలచిన వలవెల్లా వడి నీకే నెలవు
వలెనని యెచ్చరించవలెనా ఇంకాను

(॥॥)
కన్నులయెదుట నీకుఁ గాచుకవున్నదానను
విన్నవించవలెనా వేమారు నీకు
చన్నులు మీఁదెత్తుక యాసలతోడ నున్నదాన
వన్నెలఁ గానుకలియ్యవలెనా ఇంకాను

(॥॥)
అంది మోవితేనెలు నీకని దాఁచుకున్నదాన
విందుచెప్పవలెనా వింతగా నీకు
పొంది నీపాదాలపైఁ జూపులు నిలిపినదాన
వందనములు సేయఁగవలెనా యింకాను

(॥॥)
కలసి మెలసి నీకాఁగిటలో నున్నదాన
తలఁపించవలెనా తగవు నీకు
వెలయ శ్రీ వేంకటేశ వేడుకైన యట్టిదాన
వలనుగాఁ గడునవ్వవలెనా యింకాను

(||pallavi||)
valasina valavĕllā vaḍi nīge nĕlavu
valĕnani yĕchchariṁchavalĕnā iṁkānu

(||||)
kannulayĕduḍa nīgum̐ gāsugavunnadānanu
vinnaviṁchavalĕnā vemāru nīgu
sannulu mīm̐dĕttuga yāsaladoḍa nunnadāna
vannĕlam̐ gānugaliyyavalĕnā iṁkānu

(||||)
aṁdi movidenĕlu nīgani dām̐sugunnadāna
viṁdusĕppavalĕnā viṁtagā nīgu
pŏṁdi nībādālabaim̐ jūbulu nilibinadāna
vaṁdanamulu seyam̐gavalĕnā yiṁkānu

(||||)
kalasi mĕlasi nīgām̐giḍalo nunnadāna
talam̐piṁchavalĕnā tagavu nīgu
vĕlaya śhrī veṁkaḍeśha veḍugaina yaṭṭidāna
valanugām̐ gaḍunavvavalĕnā yiṁkānu