Valasina padidoda vaamdi maada laadanoba

వలచిన పతితోడ వాఁడి మాట లాడనోప
Language

(॥పల్లవి॥)
వలచిన పతితోడ వాఁడి మాట లాడనోప
మలసి నా నవ్వులే మల్లెపూజ గాదా

(॥వల॥)
గొప్పలు నాకుచములు కొండలఁ బోలుచనేలా
ఒప్పగుపతిఁ గాఁగిట నొత్తనేలా
దప్పిదేర నవియే తామరలఁ బోలిచితే
నెప్పున మా యిద్దరికి నిచ్చపూజ గదా

(॥వల॥)
మచ్చిక మాకనుచూపు మరునమ్ములననేల
నచ్చుదాఁక నా విభుని నాటించనేల
కచ్చుపెట్టి అవియే కలువలఁ బోలిచితే
మచ్చికైనమాలోని మంచిపూజ గాదా

(॥వల॥)
తనువు తీగెననేల తక్కక వొరయనేల
అనుగుఁబూవుఁగోమలినంటే మేలు
ఘనుఁడు శ్రీ వేంకటేశుకాఁగిఁటఁ గూడితి నేను
చనువున మాలోనిసరపూజ గాదా

(||pallavi||)
valasina padidoḍa vām̐ḍi māḍa lāḍanoba
malasi nā navvule mallĕbūja gādā

(||vala||)
gŏppalu nāgusamulu kŏṁḍalam̐ bolusanelā
ŏppagubadim̐ gām̐giḍa nŏttanelā
dappidera naviye tāmaralam̐ boliside
nĕppuna mā yiddarigi nichchabūja gadā

(||vala||)
machchiga māganusūbu marunammulananela
nachchudām̐ka nā vibhuni nāḍiṁchanela
kachchubĕṭṭi aviye kaluvalam̐ boliside
machchigainamāloni maṁchibūja gādā

(||vala||)
tanuvu tīgĕnanela takkaga vŏrayanela
anugum̐būvum̐gomalinaṁṭe melu
ghanum̐ḍu śhrī veṁkaḍeśhugām̐gim̐ṭam̐ gūḍidi nenu
sanuvuna mālonisarabūja gādā