వలచిన పతి వాఁడే వచ్చినదాన నే నిదె
(॥పల్లవి॥)
వలచిన పతి వాఁడే వచ్చినదాన నే నిదె
తలఁపులుఁ దలపులు తారుకాణ లెన్నఁడే
(॥వల॥)
పచ్చఁబుచ్చఁబున్నములు పొలఁతి నీనవ్వులు
యిచ్చట నీపతిఁ జూచే దిఁక నెన్నడే
నిచ్చ నిచ్చఁ గొత్తలాయ నెలఁత నీజవ్వనము
మెచ్చి మెచ్చి ఆతనితో మేలమాడు టెన్నఁడే
(॥వల॥)
వండవండ నట్లాయ వాడిక నీవలపు
నిండినపతి కాఁగిట నించు టెన్నడే
వుండ నుండ నొగరాయ వువిద నీజంకెనలు
అండ నాతనికి వినయాలు సేయు టెన్నఁడే
(॥వల॥)
తినఁదినఁ దీపులాయ తెరవ నీమోవిజున్ను
పొనిఁగి శ్రీవేంకటెశుపొందు లెన్నఁడే
ననిచి యాతఁడే నేఁడు నయముల నిన్నుఁ గూడె
మనకి మీలోలోన మందలించు టెన్నఁడే
(||pallavi||)
valasina padi vām̐ḍe vachchinadāna ne nidĕ
talam̐pulum̐ dalabulu tārugāṇa lĕnnam̐ḍe
(||vala||)
pachcham̐buchcham̐bunnamulu pŏlam̐ti nīnavvulu
yichchaḍa nībadim̐ jūse dim̐ka nĕnnaḍe
nichcha nichcham̐ gŏttalāya nĕlam̐ta nījavvanamu
mĕchchi mĕchchi ādanido melamāḍu ṭĕnnam̐ḍe
(||vala||)
vaṁḍavaṁḍa naṭlāya vāḍiga nīvalabu
niṁḍinabadi kām̐giḍa niṁchu ṭĕnnaḍe
vuṁḍa nuṁḍa nŏgarāya vuvida nījaṁkĕnalu
aṁḍa nādanigi vinayālu seyu ṭĕnnam̐ḍe
(||vala||)
tinam̐dinam̐ dībulāya tĕrava nīmovijunnu
pŏnim̐gi śhrīveṁkaḍĕśhubŏṁdu lĕnnam̐ḍe
nanisi yādam̐ḍe nem̐ḍu nayamula ninnum̐ gūḍĕ
managi mīlolona maṁdaliṁchu ṭĕnnam̐ḍe