వలచిన కొలఁదే వాడికెలెల్లా
(॥పల్లవి॥)
వలచిన కొలఁదే వాడికెలెల్లా
బలిమి సేయఁగఁ బోతే పనికి వచ్చీనా
(॥వల॥)
సొలసి నీమర్మములు సోఁక నిన్నుఁబలుకఁగా
వెలఁదివటలు నీకు వేడు కాయను
యెలమితో వింతవారు యిచ్చకము లాడినాను
పలుచుఁదనమే కాక పయ్ర మయ్యీనా
(॥వల॥)
చేకొని చెక్కులు వెవ చేయి చాఁచి పనఁగఁగా
ఆకెచేఁతలే నీకు నందవయను
యీకడాకడివారు నీ కెంత సేవ సేసినాను
మేకుల కందువు గాక మెచ్చఁ బొయ్యెవా
(॥వల॥)
కడఁగి చన్నుల నొత్తి కాఁగిట నిన్నలమఁగా
పడఁతిరతులు నీకుఁ బాఁతాయను
విడువలేక శ్రీవేంకటేశ నన్నేలితిఁ
వొడబా టాయఁగా కింక నోప ననేవా
(||pallavi||)
valasina kŏlam̐de vāḍigĕlĕllā
balimi seyam̐gam̐ bode panigi vachchīnā
(||vala||)
sŏlasi nīmarmamulu som̐ka ninnum̐balugam̐gā
vĕlam̐divaḍalu nīgu veḍu kāyanu
yĕlamido viṁtavāru yichchagamu lāḍinānu
palusum̐daname kāga payra mayyīnā
(||vala||)
segŏni sĕkkulu vĕva seyi sām̐si panam̐gam̐gā
āgĕsem̐tale nīgu naṁdavayanu
yīgaḍāgaḍivāru nī kĕṁta seva sesinānu
megula kaṁduvu gāga mĕchcham̐ bŏyyĕvā
(||vala||)
kaḍam̐gi sannula nŏtti kām̐giḍa ninnalamam̐gā
paḍam̐tiradulu nīgum̐ bām̐tāyanu
viḍuvalega śhrīveṁkaḍeśha nannelidim̐
vŏḍabā ṭāyam̐gā kiṁka noba nanevā