Valasidi namtaa naadi vatti sada laadanido

వలచితి నంటా నాడి వట్టి సట లాతనితో
Language

(॥పల్లవి॥)
వలచితి నంటా నాడి వట్టి సట లాతనితో
తెలిపి చెప్పఁగఁబోయె తెలివిది యేఁటిదే

(॥॥)
యే యెడా మనసులలో నెరవు లేకుంట గాక
చేయి పట్టి పెనఁగేటి చెలి మేఁటిదే
చాయలా సన్నలనే చవులు గొనుట గాక
ఆయ మెఱుఁగ కప్పణ లడిగేటి దేఁటిదే

(॥॥)
కన్నుచూపులనే చూచి కళలు రేఁగుట గాక
విన్నపాలు సేయఁ బోయే వేడు కేఁటిదే
చన్నుల గుఱుతులకే సంతోసించుకొంట గాక
అన్నిటాఁ గొరఁబోయే వేడు ఆసోదా లేఁటివే

(॥॥)
సురతపు సుద్దులనే చొక్కుచు నుండుట గాక
సరసము లాడేటి జాగు లేఁటివే
యిరవై శ్రీ వేంకటేశుఁ డిదెవో నన్నుఁగూడె
తరుణిరో తమలోని తగులము లేఁటివే

(||pallavi||)
valasidi naṁṭā nāḍi vaṭṭi saḍa lādanido
tĕlibi sĕppam̐gam̐boyĕ tĕlividi yem̐ṭide

(||||)
ye yĕḍā manasulalo nĕravu leguṁṭa gāga
seyi paṭṭi pĕnam̐geḍi sĕli mem̐ṭide
sāyalā sannalane savulu gŏnuḍa gāga
āya mĕṟum̐ga kappaṇa laḍigeḍi dem̐ṭide

(||||)
kannusūbulane sūsi kaḽalu rem̐guḍa gāga
vinnabālu seyam̐ boye veḍu kem̐ṭide
sannula guṟudulage saṁtosiṁchugŏṁṭa gāga
anniḍām̐ gŏram̐boye veḍu āsodā lem̐ṭive

(||||)
suradabu suddulane sŏkkusu nuṁḍuḍa gāga
sarasamu lāḍeḍi jāgu lem̐ṭive
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍidĕvo nannum̐gūḍĕ
taruṇiro tamaloni tagulamu lem̐ṭive