Valaside rebu maabu vachchevu gaani

వలసితే రేపు మాపు వచ్చేవు గాని
Language

(॥పల్లవి॥)
వలసితే రేపు మాపు వచ్చేవు గాని
అలమి చేయెత్తి మొక్కి అంపించుక రావె

(॥వలసితే॥)
యేడ లేనిమాఁటలు యెందాఁక నైనఁ బెనచి
ఆడెవు మాఁటలు నీవు అతనితోను
తోడ నంపించుక రావె తుద లేదీ యాసలకు
నీ డనపు యెం డనవు నిలుచుండే వీడను

(॥వలసితే॥)
కూరి మెల్లఁ బెట్టి పెట్టి కొనచూపు నాఁటఁ జూచి
ఆరగించఁ బోఁ జాల వాతనిఁ బాసి
యీ రీతి నింత గలితె యింటి కైనాఁ దోడి తేవె
తీరవు మీ ముచ్చటలు దీవెత్తుఁబొద్దాయను

(॥వలసితే॥)
గయ్యాళి వై నవ్వి నవ్వి కాఁగిట బింగించుకొని
యెయ్యెడఁ బోనీవు యేమే యితని
నెయ్యపు శ్రీవెంకటేశు నీవుఁ గూడితివి ఆతఁ
డియ్యడనె వుండీఁ గాని యిల్లు వెళ్ల నీకువే

(||pallavi||)
valaside rebu mābu vachchevu gāni
alami seyĕtti mŏkki aṁpiṁchuga rāvĕ

(||valaside||)
yeḍa lenimām̐ṭalu yĕṁdām̐ka nainam̐ bĕnasi
āḍĕvu mām̐ṭalu nīvu adanidonu
toḍa naṁpiṁchuga rāvĕ tuda ledī yāsalagu
nī ḍanabu yĕṁ ḍanavu nilusuṁḍe vīḍanu

(||valaside||)
kūri mĕllam̐ bĕṭṭi pĕṭṭi kŏnasūbu nām̐ṭam̐ jūsi
āragiṁcham̐ bom̐ jāla vādanim̐ bāsi
yī rīdi niṁta galidĕ yiṁṭi kainām̐ doḍi tevĕ
tīravu mī muchchaḍalu dīvĕttum̐bŏddāyanu

(||valaside||)
gayyāḽi vai navvi navvi kām̐giḍa biṁgiṁchugŏni
yĕyyĕḍam̐ bonīvu yeme yidani
nĕyyabu śhrīvĕṁkaḍeśhu nīvum̐ gūḍidivi ādam̐
ḍiyyaḍanĕ vuṁḍīm̐ gāni yillu vĕḽla nīguve