వలచి వచ్చితి నేను వానికిఁగాను
(॥పల్లవి॥)
వలచి వచ్చితి నేను వానికిఁగాను
నెలవై మీ గొల్లవాడనే తానుండున(నం?)టా
(॥॥)
చెందమ్మి కన్నులవాఁడు చేతిపిల్లఁగోవివాఁడు
యిందు వచ్చెఁగంటిరా యేమిరే యమ్మా
మందలపసువులవాఁడు మకరాంకములవాఁడు
యెందు నున్నాఁడు చెప్పరే యేల దాఁచేరమ్మా
(॥॥)
నెమలి పించెమువాఁడు నీలమేఘకాంతివాఁడు
రమణుఁడాతఁడు మొక్కె రమ్మనరమ్మా
జమళి చేతులవాఁడు సంకుఁజక్రములవాఁడు
అమర మీపాలఁ జిక్కునట చూపరమ్మా
(॥॥)
పచ్చఁబైఁడి దట్టివాఁడు పక్షివాహనపువాఁడు
యిచ్చినాఁడు నా కుంగర మిదివో యమ్మా
చెచ్చెరఁ గొనేటివాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు
వచ్చి నన్నుఁ గూడినాఁడు వాఁడువో యమ్మా
(||pallavi||)
valasi vachchidi nenu vānigim̐gānu
nĕlavai mī gŏllavāḍane tānuṁḍuna(naṁ?)ṭā
(||||)
sĕṁdammi kannulavām̐ḍu sedibillam̐govivām̐ḍu
yiṁdu vachchĕm̐gaṁṭirā yemire yammā
maṁdalabasuvulavām̐ḍu magarāṁkamulavām̐ḍu
yĕṁdu nunnām̐ḍu sĕppare yela dām̐serammā
(||||)
nĕmali piṁchĕmuvām̐ḍu nīlameghagāṁtivām̐ḍu
ramaṇum̐ḍādam̐ḍu mŏkkĕ rammanarammā
jamaḽi sedulavām̐ḍu saṁkum̐jakramulavām̐ḍu
amara mībālam̐ jikkunaḍa sūbarammā
(||||)
pachcham̐baim̐ḍi daṭṭivām̐ḍu pakṣhivāhanabuvām̐ḍu
yichchinām̐ḍu nā kuṁgara midivo yammā
sĕchchĕram̐ gŏneḍivām̐ḍu śhrī veṁkaḍeśhvarum̐ḍu
vachchi nannum̐ gūḍinām̐ḍu vām̐ḍuvo yammā