Valasi nollami gaadu vanida moham bidiye

వలసి నొల్లమి గాదు వనిత మోహం బిదియే
Language

(॥పల్లవి॥)
వలసి నొల్లమి గాదు వనిత మోహం బిదియే
అలుక గాదొ విభుఁడ అతివఁ జేకొనువిూ

(॥వలసి॥)
కప్పురము నీ వంపఁగా జూచి మా రమణి
దపతో గాలిమంటపము దూరె
అప్పటి దవ్వులనే అద్దంబు గని మోము
దిప్పి ముత్యాలపందిలి కేఁగెను

(॥వలసి॥)
చలివేఁడి తేనియలు సతికి నీ వంపఁగా
నెలమితోఁ బువ్వుఁబొదరింటి కేఁగె
ములువాఁడి ననవిరులు మొగి మఱియు నంప్పఁగా
దెలిసి నీలపుదోమతెర మాటు కేఁగె

(॥వలసి॥)
యింతలో శ్రీవేంకటేశ చిగురుఁ గిల్లాకు
కాంత కియ్యఁగా మదనుగరిడి చేరి
దొంతి తామెరలు తోడుతనే చూపఁగా
సంతసంబున చంద్రశాలలో నిలిచె

(||pallavi||)
valasi nŏllami gādu vanida mohaṁ bidiye
aluga gādŏ vibhum̐ḍa adivam̐ jegŏnuviూ

(||valasi||)
kappuramu nī vaṁpam̐gā jūsi mā ramaṇi
dabado gālimaṁṭabamu dūrĕ
appaḍi davvulane addaṁbu gani momu
dippi mutyālabaṁdili kem̐gĕnu

(||valasi||)
salivem̐ḍi teniyalu sadigi nī vaṁpam̐gā
nĕlamidom̐ buvvum̐bŏdariṁṭi kem̐gĕ
muluvām̐ḍi nanavirulu mŏgi maṟiyu naṁppam̐gā
dĕlisi nīlabudomadĕra māḍu kem̐gĕ

(||valasi||)
yiṁtalo śhrīveṁkaḍeśha sigurum̐ gillāgu
kāṁta kiyyam̐gā madanugariḍi seri
dŏṁti tāmĕralu toḍudane sūbam̐gā
saṁtasaṁbuna saṁdraśhālalo nilisĕ