వలపులేని జోలి వట్టి విరాలి
(॥పల్లవి॥)
వలపులేని జోలి వట్టి విరాలి
యెలయించె నన్నుఁ దాను యేమి సేయుమనీనే
(॥వల॥)
మంతనములే యాడితి మాపురాఁకాఁ దనతోను
వింతగాఁ జోకటాలాడి వేగించితి
చెంతనే పొద్దులువుచ్చి చెలరేఁగి నవ్వితి -
వింతసేసెనన్ను దానె యేమిసేయుమనీనే
(॥వల॥)
సారెసారె రచ్చెలోన సరసములాడితి
కోరి కొలువులు సేసి గుబ్బతిలితి
తేరకొనఁ జూచిచూచి తేలితిఁ దనమాయల
యీరీతిఁదా నింతసేసె నేమిసేయుమనీనే
(॥వల॥)
ఆసాసలఁ గొంతవడి యట్టె పాదాలొత్తితి
రాసినసిగ్గులలోన రాఁపైతిని
సేసవెట్టి నన్నుఁ గూడె శ్రీవేంకటేశ్వరుఁడు
యీసులే కింతసేసెఁదా నేమిసేయుమనీనే
(||pallavi||)
valabuleni joli vaṭṭi virāli
yĕlayiṁchĕ nannum̐ dānu yemi seyumanīne
(||vala||)
maṁtanamule yāḍidi māburām̐kām̐ danadonu
viṁtagām̐ jogaḍālāḍi vegiṁchidi
sĕṁtane pŏdduluvuchchi sĕlarem̐gi navvidi -
viṁtasesĕnannu dānĕ yemiseyumanīne
(||vala||)
sārĕsārĕ rachchĕlona sarasamulāḍidi
kori kŏluvulu sesi gubbadilidi
teragŏnam̐ jūsisūsi telidim̐ danamāyala
yīrīdim̐dā niṁtasesĕ nemiseyumanīne
(||vala||)
āsāsalam̐ gŏṁtavaḍi yaṭṭĕ pādālŏttidi
rāsinasiggulalona rām̐paidini
sesavĕṭṭi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
yīsule kiṁtasesĕm̐dā nemiseyumanīne