Valabule kaamdi paari varusa niddarigini

వలపులె కాఁడి పారి వరుస నిద్దరికిని
Language

(॥పల్లవి॥)
వలపులె కాఁడి పారి వరుస నిద్దరికిని
నిలువుఁ దమకములు నీవే యెరుఁగుదువూ

(॥వలపులె॥)
యెన్నఁడొకో నీవు నన్ను యెనసి మన్నించేది
చన్నుల నే నిన్ను నొత్తి సాధించేది
వున్నదాన మేడమీఁద నొంటి నేఁ బొడవునను
సన్న సేసేవు నీ వైతే సారెకు దిగువను

(॥వలపులె॥)
యెప్పుడొకో నా మేను యిటు నీ మేను సోఁకేది
అప్పటి నే మారుకు మా రప్పళించేది
కప్పురపుబాగాలు కట్టివేసితిని నీపై
నెప్పున నందుకొంటివి నిచ్చె నెక్కి నీవూ

(॥వలపులె॥)
యేవేళకో నామంచ మెక్కి నీవు గూచుండేడి
తావుల నేనె నిన్ను దక్కఁ గొనేది
శ్రీవెంకటేశ్వర నిన్ను చేవట్టి యెక్కించుకొంటి
మావి యిచ్చి కూడితిని ముచ్చటతో నీవు

(||pallavi||)
valabulĕ kām̐ḍi pāri varusa niddarigini
niluvum̐ damagamulu nīve yĕrum̐guduvū

(||valabulĕ||)
yĕnnam̐ḍŏgo nīvu nannu yĕnasi manniṁchedi
sannula ne ninnu nŏtti sādhiṁchedi
vunnadāna meḍamīm̐da nŏṁṭi nem̐ bŏḍavunanu
sanna sesevu nī vaide sārĕgu diguvanu

(||valabulĕ||)
yĕppuḍŏgo nā menu yiḍu nī menu som̐kedi
appaḍi ne mārugu mā rappaḽiṁchedi
kappurabubāgālu kaṭṭivesidini nībai
nĕppuna naṁdugŏṁṭivi nichchĕ nĕkki nīvū

(||valabulĕ||)
yeveḽago nāmaṁcha mĕkki nīvu gūsuṁḍeḍi
tāvula nenĕ ninnu dakkam̐ gŏnedi
śhrīvĕṁkaḍeśhvara ninnu sevaṭṭi yĕkkiṁchugŏṁṭi
māvi yichchi kūḍidini muchchaḍado nīvu