Valabulalo neegeevanne livi inniyunu

వలపులలో నీకీవన్నె లివి ఇన్నియును
Language

(॥పల్లవి॥)
వలపులలో నీకీవన్నె లివి ఇన్నియును
మలతురు సొలతురు మంకుల నుండుదురు

(॥॥)
చలపాదితనములు సహజము సతులకు
వెలఁది నేమీననక వేఁడుకొవయ్యా
పలుకుదు రేమైనాఁ బక్కన జంకితురు
పిలువఁ బిలువ నట్టె బిగుతు రెంతైనా

(॥॥)
కడుగట్టితనములు కలిగిన వెప్పుడును
పడఁతికి నీవిట్టేపంతమీవయ్యా
కొడిమెలు గట్టుదురు కోపములు చూపుదురు
తడవినంతటిలోనే తప్పులువట్టుదురు

(॥॥)
ఆసోదపుఁదనములె అంగములు కాంతలకు
యీ సుదతిఁ గూడితివి యేలుకోవయ్యా
బాస లడుగుదురు పై పై శ్రీ వేంకటేశ్వర
సేసవెట్టి గర్వాన చెక్కులు నొక్కుదురు

(||pallavi||)
valabulalo nīgīvannĕ livi inniyunu
maladuru sŏladuru maṁkula nuṁḍuduru

(||||)
salabādidanamulu sahajamu sadulagu
vĕlam̐di nemīnanaga vem̐ḍugŏvayyā
palugudu remainām̐ bakkana jaṁkiduru
piluvam̐ biluva naṭṭĕ bigudu rĕṁtainā

(||||)
kaḍugaṭṭidanamulu kaligina vĕppuḍunu
paḍam̐tigi nīviṭṭebaṁtamīvayyā
kŏḍimĕlu gaṭṭuduru kobamulu sūbuduru
taḍavinaṁtaḍilone tappuluvaṭṭuduru

(||||)
āsodabum̐danamulĕ aṁgamulu kāṁtalagu
yī sudadim̐ gūḍidivi yelugovayyā
bāsa laḍuguduru pai pai śhrī veṁkaḍeśhvara
sesavĕṭṭi garvāna sĕkkulu nŏkkuduru