(॥పల్లవి॥)
వలపులా గటువంటిదివో
పిలిచేటి ప్రియమున బీరము మఱచె
(॥వల॥)
వెలఁది నిన్నుఁ గని వేడుకతోడను
అలుక లన్నియును నటు మఱచె
నలుగడ నీతో నవ్వెటి సందడి
చలములు లోలో సాదించ మఱచె
(॥వల॥)
యింతి విడె మిదె యిచ్చె పరాకున
పంతపు టొట్లపని మఱచె
చెంతల నినుఁ గడు చెనకే సొబగున
కొంతయినఁ దొల్లిటి కోపము మఱచె
(॥వల॥)
కొమ్మ కాఁగిటను కూడే తమకమున
సమ్మతి జంకించఁగ మఱచె
యిమ్ముల శ్రీవెంకటేశ కలసితివి
చిమ్ముల యెరవులు సేయఁగ మఱచె
(||pallavi||)
valabulā gaḍuvaṁṭidivo
piliseḍi priyamuna bīramu maṟasĕ
(||vala||)
vĕlam̐di ninnum̐ gani veḍugadoḍanu
aluga lanniyunu naḍu maṟasĕ
nalugaḍa nīdo navvĕḍi saṁdaḍi
salamulu lolo sādiṁcha maṟasĕ
(||vala||)
yiṁti viḍĕ midĕ yichchĕ parāguna
paṁtabu ṭŏṭlabani maṟasĕ
sĕṁtala ninum̐ gaḍu sĕnage sŏbaguna
kŏṁtayinam̐ dŏlliḍi kobamu maṟasĕ
(||vala||)
kŏmma kām̐giḍanu kūḍe tamagamuna
sammadi jaṁkiṁcham̐ga maṟasĕ
yimmula śhrīvĕṁkaḍeśha kalasidivi
simmula yĕravulu seyam̐ga maṟasĕ