Valabula vasamtamu vanidabai naadevu

వలపుల వసంతము వనితపై నాడేవు
Language

(॥పల్లవి॥)
వలపుల వసంతము వనితపై నాడేవు
చెలియ నీమీఁద నెంత సేసునో యిందుకు

(॥వల॥)
పువ్వులఁగొని చన్నులు పూఁచి నీవు వేయఁగాను
నవ్వుతా నిన్నుఁదిట్టె నలినాక్షి
వువ్విళ్ళూరి నీ వంతలో నిడివట్టి తియ్యఁగాను
చివ్వన ని న్నా పె యేమి సేసువో యింకను

(॥వల॥)
కుమ్మరించి పన్నీరు కుచ్చెలపైఁ జల్ల రాఁగా
చిమ్మిరేంగి వొట్టువెట్టీఁ జెలియ
కమ్మర నీ వందుకుఁగాఁ గాఁగిలించి పెనఁగఁగా
దొమ్మిసేసి యాపె యెంతతొడరునో నిన్నును

(॥వల॥)
కడఁగి తురుము మీఁద కప్పురము చల్లఁగాను
అడరి తా వేఁడుకొని నతివ
తొడిఁబడఁ గూడితివి తొలుతే శ్రీవేంకటేశ
చిడుముడిరతి నెంతకుచెనకునో యిపుడు

(||pallavi||)
valabula vasaṁtamu vanidabai nāḍevu
sĕliya nīmīm̐da nĕṁta sesuno yiṁdugu

(||vala||)
puvvulam̐gŏni sannulu pūm̐si nīvu veyam̐gānu
navvudā ninnum̐diṭṭĕ nalinākṣhi
vuvviḽḽūri nī vaṁtalo niḍivaṭṭi tiyyam̐gānu
sivvana ni nnā pĕ yemi sesuvo yiṁkanu

(||vala||)
kummariṁchi pannīru kuchchĕlabaim̐ jalla rām̐gā
simmireṁgi vŏṭṭuvĕṭṭīm̐ jĕliya
kammara nī vaṁdugum̐gām̐ gām̐giliṁchi pĕnam̐gam̐gā
dŏmmisesi yābĕ yĕṁtadŏḍaruno ninnunu

(||vala||)
kaḍam̐gi turumu mīm̐da kappuramu sallam̐gānu
aḍari tā vem̐ḍugŏni nadiva
tŏḍim̐baḍam̐ gūḍidivi tŏlude śhrīveṁkaḍeśha
siḍumuḍiradi nĕṁtagusĕnaguno yibuḍu