వలపుల సొలపుల వసంతవేళ యిది
(॥పల్లవి॥)
వలపుల సొలపుల వసంతవేళ యిది
సెలవి నవ్వకువే చెమరించీ మేను
(॥॥)
శిరసు వంచకువే సిగ్గులు వడకువే
పరగ నిన్నతఁడు తప్పక చూచీని
విరులు దులుపకువే వెసఁ దప్పించుకోకువే
సిరుల నీవిభుడిట్టే సేసవెట్టీని
(॥॥)
చేయెత్తి యొడ్డుకోకువే చేరియాన వెట్టకువే
చాయల నాతఁడు నీ చన్నులంటీని
ఆయములు దాఁచకువే అట్టే వెరగందకువే
మోయ నాడీ సరసము మోహాన నీ విభుఁడు
(॥॥)
పెనఁగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీ వేంకటేశుఁడు కౌఁగిలించీని
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చన విచ్చి నన్ను నేలె సమ్మతించియాతఁడూ
(||pallavi||)
valabula sŏlabula vasaṁtaveḽa yidi
sĕlavi navvaguve sĕmariṁchī menu
(||||)
śhirasu vaṁchaguve siggulu vaḍaguve
paraga ninnadam̐ḍu tappaga sūsīni
virulu dulubaguve vĕsam̐ dappiṁchugoguve
sirula nīvibhuḍiṭṭe sesavĕṭṭīni
(||||)
seyĕtti yŏḍḍugoguve seriyāna vĕṭṭaguve
sāyala nādam̐ḍu nī sannulaṁṭīni
āyamulu dām̐saguve aṭṭe vĕragaṁdaguve
moya nāḍī sarasamu mohāna nī vibhum̐ḍu
(||||)
pĕnam̐gulāḍaguve biguvu sūbaguve
ghana śhrī veṁkaḍeśhum̐ḍu kaum̐giliṁchīni
anumāniṁchaguve alamelmaṁgavu nīvu
sana vichchi nannu nelĕ sammadiṁchiyādam̐ḍū