Valabu visigidenu vaasana gaddaa

వలపు విసికితేను వాసన గద్దా
Language

(॥పల్లవి॥)
వలపు విసికితేను వాసన గద్దా
చలము సాదించఁ బోతే చవి గావు పనులు

(॥వలపు॥)
మచ్చిక నీతో నిట్టె మాటలాడినప్పుడె
చెచ్చెర నీ పొందు నేఁ జేసినదాన
కొచ్చి కొచ్చి నన్నేల కొంగు వట్టి తీసేవు
వచ్చినదాననె యాల వడిఁబట్టె విఁకను

(॥వలపు॥)
కన్నుఁగొనలను నిన్నుఁ గనుఁగొన్నయప్పుడె
యిన్నిపనులకు నే నియ్యకొందాన
మన్నించి యేకతములు మరి యేల చెప్పేవు
విన్నదాననె తొల్లి వేసరించ కిఁకను

(॥వలపు॥)
గక్కననె నిన్ను మెచ్చి కాఁగిలింనప్పుడె
గుక్కక రతులలోఁ గూడినదాన
యిక్కువ శ్రీవెంకటేశ యేలితివి నన్ను నిట్టె
దక్కినదాననె తొల్లె దయఁ జూడు మిఁకను

(||pallavi||)
valabu visigidenu vāsana gaddā
salamu sādiṁcham̐ bode savi gāvu panulu

(||valabu||)
machchiga nīdo niṭṭĕ māḍalāḍinappuḍĕ
sĕchchĕra nī pŏṁdu nem̐ jesinadāna
kŏchchi kŏchchi nannela kŏṁgu vaṭṭi tīsevu
vachchinadānanĕ yāla vaḍim̐baṭṭĕ vim̐kanu

(||valabu||)
kannum̐gŏnalanu ninnum̐ ganum̐gŏnnayappuḍĕ
yinnibanulagu ne niyyagŏṁdāna
manniṁchi yegadamulu mari yela sĕppevu
vinnadānanĕ tŏlli vesariṁcha kim̐kanu

(||valabu||)
gakkananĕ ninnu mĕchchi kām̐giliṁnappuḍĕ
gukkaga radulalom̐ gūḍinadāna
yikkuva śhrīvĕṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
dakkinadānanĕ tŏllĕ dayam̐ jūḍu mim̐kanu