వలపు వేఁచి కొరుకవద్దే నేఁడు
(॥పల్లవి॥)
వలపు వేఁచి కొరుకవద్దే నేఁడు
చెలి నింత సేయఁగాను సెలవేమే తనకు
(॥॥)
చిగురఁ బోడికి నేఁడు చింత దగునా
వెగటు మాని యతని విచ్చేయుమనవే
తగదు యీపె అలపు తనది గాదా
మగవాఁడే ఇంతైతే మానుపరాదనరే
(॥॥)
కమలగంధికి నేఁడు కాఁక లింత దగునా
తమకానఁ జేకొని దయఁజూడుమనవే
అమరదు యీదోస మంతేసి మేలా
తమబోఁటు లిట్లైతేఁ దప్పించరాదనరే
(॥॥)
వెసఁ గోమలికిని విరహము దగునా
యెసఁగి శ్రీ వేంకటేశుఁ నీపెఁ గావుమనమే
అసము దించక నేఁ డంతలో విచ్చేసి కూడె
రసికులచేఁతలెల్లా రతికెక్కెననరే
(||pallavi||)
valabu vem̐si kŏrugavadde nem̐ḍu
sĕli niṁta seyam̐gānu sĕlaveme tanagu
(||||)
siguram̐ boḍigi nem̐ḍu siṁta dagunā
vĕgaḍu māni yadani vichcheyumanave
tagadu yībĕ alabu tanadi gādā
magavām̐ḍe iṁtaide mānubarādanare
(||||)
kamalagaṁdhigi nem̐ḍu kām̐ka liṁta dagunā
tamagānam̐ jegŏni dayam̐jūḍumanave
amaradu yīdosa maṁtesi melā
tamabom̐ṭu liṭlaidem̐ dappiṁcharādanare
(||||)
vĕsam̐ gomaligini virahamu dagunā
yĕsam̐gi śhrī veṁkaḍeśhum̐ nībĕm̐ gāvumaname
asamu diṁchaga nem̐ ḍaṁtalo vichchesi kūḍĕ
rasigulasem̐talĕllā radigĕkkĕnanare