Valabu tolugarimche vanidabai nide nemdu

వలపు తొలుకరించె వనితపై నిదె నేఁడు
Language

(॥పల్లవి॥)
వలపు తొలుకరించె వనితపై నిదె నేఁడు
చెలువుఁడ వింతట విచ్చేయవయ్యా

(॥వల॥)
పడఁతివిరహవేళ పానుపుపైఁ దెగి రాలే-
వడిముత్యపుసరులే వడగండ్లు
చిడుముడి మేనిమీఁదచిప్పిలేటిచెమటలు
జడివాన గురిసీ విచారించవయ్యా

(॥వల॥)
నిరతిఁ దురుము మొయిలు నిలువెల్లా ముంచుకొనె
గరిమ నిట్టూర్పు పెనుగాలివంకను
నిరతపుఁ బులకల నీరుబుగ్గలవి మించె
నిరులఁ గన్నీటిసొన చినుకులవంకను

(॥వల॥)
యొద్దరికాఁగిటిలంకె యింద్రధనువులు మించె
వొద్దనే మాచెలిఁ గూడి వుండేవంకను
నిద్దపుశ్రీవేంకటేశ నిండెఁ జిత్తపుమడుగు
కొద్దిగా మోహరసాలు కురిసినవంకను

(||pallavi||)
valabu tŏlugariṁchĕ vanidabai nidĕ nem̐ḍu
sĕluvum̐ḍa viṁtaḍa vichcheyavayyā

(||vala||)
paḍam̐tivirahaveḽa pānububaim̐ dĕgi rāle-
vaḍimutyabusarule vaḍagaṁḍlu
siḍumuḍi menimīm̐dasippileḍisĕmaḍalu
jaḍivāna gurisī visāriṁchavayyā

(||vala||)
niradim̐ durumu mŏyilu niluvĕllā muṁchugŏnĕ
garima niṭṭūrbu pĕnugālivaṁkanu
niradabum̐ bulagala nīrubuggalavi miṁchĕ
nirulam̐ gannīḍisŏna sinugulavaṁkanu

(||vala||)
yŏddarigām̐giḍilaṁkĕ yiṁdradhanuvulu miṁchĕ
vŏddane māsĕlim̐ gūḍi vuṁḍevaṁkanu
niddabuśhrīveṁkaḍeśha niṁḍĕm̐ jittabumaḍugu
kŏddigā moharasālu kurisinavaṁkanu