వలపు చప్పఁ జేసెటి వగకాఁడ నీ
(॥పల్లవి॥)
వలపు చప్పఁ జేసెటి వగకాఁడ నీ
బలిమి నా మనసుకుఁ బల్ల కట్టవలెనా
(॥వలపు॥)
పలికేవు కమ్మటిని పరాకు నయ్యేవు
అలిగినాఁ బోనీవు అదేరా నీవు
పిలిచితే వచ్చినది పెనుఁ దప్పు నావొళ్లఁ
గలదు నీ విఁక నన్నుఁ గాకు నేయ వలెను
(॥వలపు॥)
పైపైఁ గొంగు వట్టేవు పరులతో నవ్వేవు
వోప నన్నఁ బోనీవు వోరి నీవూ
పాప మింతే నీవు నేసే భ్రమకు లో నయినది
యేపున నెంతైనాఁ గద్దు యింత సేయ వలెనా
(॥వలపు॥)
యిచ్చగించి కూడేవు యే మేమో తలఁచేవు
హెచ్చి మూల నుండనీవు యేరా నీవూ
అచ్చపు శ్రీవెంకటేశ అన్ని టాను నిన్ను గూడి
మెచ్చినదె మే లాయ మేకు నేయ వలెనా
(||pallavi||)
valabu sappam̐ jesĕḍi vagagām̐ḍa nī
balimi nā manasugum̐ balla kaṭṭavalĕnā
(||valabu||)
paligevu kammaḍini parāgu nayyevu
aliginām̐ bonīvu aderā nīvu
piliside vachchinadi pĕnum̐ dappu nāvŏḽlam̐
galadu nī vim̐ka nannum̐ gāgu neya valĕnu
(||valabu||)
paibaim̐ gŏṁgu vaṭṭevu parulado navvevu
voba nannam̐ bonīvu vori nīvū
pāba miṁte nīvu nese bhramagu lo nayinadi
yebuna nĕṁtainām̐ gaddu yiṁta seya valĕnā
(||valabu||)
yichchagiṁchi kūḍevu ye memo talam̐sevu
hĕchchi mūla nuṁḍanīvu yerā nīvū
achchabu śhrīvĕṁkaḍeśha anni ṭānu ninnu gūḍi
mĕchchinadĕ me lāya megu neya valĕnā