వలపు చల్లుదుఁగాని వాడిక నే నొల్లనయ్య
(॥పల్లవి॥)
వలపు చల్లుదుఁగాని వాడిక నే నొల్లనయ్య
తొలతొల యింతేసి లోఁతుకు నే వెరతురా
(॥వల॥)
మునుప నీచూపులకు మొక్కేఁగాని నే
వెనక నీసన్నలకు వెఱతుమయ్య
యెనలేనినవ్వులకు నెఁ తైనాఁ బొగడేఁగాని
వొనరేనీసరసము లుత్తరమీనోపరా
(॥వల॥)
ఇప్పటినీకానికలు యియ్యకొనేఁగాని నే
వొప్పుల నీవిడె మందనోపమయ్య
తప్పనినీనిజమరితనము మెచ్చేఁగాని
చెప్పేనీయేకతములు చెవియొగ్గనోపరా
(॥వల॥)
సంగడి జాణతనాలు సమ్మతించేఁగాని నే
అంగపుఁజెనకులు పయ్యాడలేనయ్యా
యెంగిలిగా శ్రీవేంకటేశుఁడ కూడితి నిట్టె
ముంగిట నిన్నిఁకఁ బాసి మోసపోనోపరా
(||pallavi||)
valabu salludum̐gāni vāḍiga ne nŏllanayya
tŏladŏla yiṁtesi lom̐tugu ne vĕradurā
(||vala||)
munuba nīsūbulagu mŏkkem̐gāni ne
vĕnaga nīsannalagu vĕṟadumayya
yĕnaleninavvulagu nĕm̐ tainām̐ bŏgaḍem̐gāni
vŏnarenīsarasamu luttaramīnobarā
(||vala||)
ippaḍinīgānigalu yiyyagŏnem̐gāni ne
vŏppula nīviḍĕ maṁdanobamayya
tappaninīnijamaridanamu mĕchchem̐gāni
sĕppenīyegadamulu sĕviyŏgganobarā
(||vala||)
saṁgaḍi jāṇadanālu sammadiṁchem̐gāni ne
aṁgabum̐jĕnagulu payyāḍalenayyā
yĕṁgiligā śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidi niṭṭĕ
muṁgiḍa ninnim̐kam̐ bāsi mosabonobarā