Valabu paigosaraide vadi mogasaadu gaadaa

వలపు పైకొసరైతే వడి మొగచాటు గాదా
Language

(॥పల్లవి॥)
వలపు పైకొసరైతే వడి మొగచాటు గాదా
లలనల సిగ్గు లేల లంకెఁ బెట్టేవయ్యా

(॥॥)
చిప్పిల నాపె తొడపై శిరసు మోవఁ బండుండి
అప్పటి నాతో నవ్వే వౌనయ్యా
కొప్పు నీ కాపె దువ్వఁగా కొంగు పట్టు కున్నాఁడవు
యిప్పుడు నీయాసోద మేమి చెప్పేమయ్యా

(॥॥)
పొదిగొన నీవాపె బుజముపైఁ జేయి వేసి
యెదుట నా మోము చూచే విదేమయ్యా
వుదుటు గుబ్బల నాపె వొత్తఁ గా కాలుదొక్కే
వదన నీ వేడు కేమని చెప్పేమయ్యా

(॥॥)
పొందు లాపెతోఁజేసి పోరచితనాన నాపై
నంది పచ్చడము గప్పే వౌనయ్యా
ముందే యాకెఁ గూడితివి మొఱఁగి శ్రీ వేంకటేశ
చెందితివి నన్నీకడ చెల్లుఁ జెల్లునయ్యా

(||pallavi||)
valabu paigŏsaraide vaḍi mŏgasāḍu gādā
lalanala siggu lela laṁkĕm̐ bĕṭṭevayyā

(||||)
sippila nābĕ tŏḍabai śhirasu movam̐ baṁḍuṁḍi
appaḍi nādo navve vaunayyā
kŏppu nī kābĕ duvvam̐gā kŏṁgu paṭṭu kunnām̐ḍavu
yippuḍu nīyāsoda memi sĕppemayyā

(||||)
pŏdigŏna nīvābĕ bujamubaim̐ jeyi vesi
yĕduḍa nā momu sūse videmayyā
vuduḍu gubbala nābĕ vŏttam̐ gā kāludŏkke
vadana nī veḍu kemani sĕppemayyā

(||||)
pŏṁdu lābĕdom̐jesi porasidanāna nābai
naṁdi pachchaḍamu gappe vaunayyā
muṁde yāgĕm̐ gūḍidivi mŏṟam̐gi śhrī veṁkaḍeśha
sĕṁdidivi nannīgaḍa sĕllum̐ jĕllunayyā