వలపు లిద్దరివిని వన్నె కెక్కెను
(॥పల్లవి॥)
వలపు లిద్దరివిని వన్నె కెక్కెను
సళుపుల తమకము సరివచ్చెను
(॥వలప॥)
మొలక ముత్యాలవంటి మొనవాఁడి దంతముల
కలికి నీకెమ్మోవి గంటిసేసెను
బలిమి నీవు జంకించి పగడాలవంటిచూపు
చిలికించఁగానట్టే చెలిమేనఁ గప్పెను
(॥వలప॥)
మొనమాణికాలవంటి ములువాఁడిగోళ్ళ
వనిత నీ సందుల వంకలొత్తెను
చెనకఁగానీకొప్పు చెదరి యాపె పై నిండి
జినుగునీలచీరయై సిగ్గులెల్లాఁ గప్పెను
(॥వలప॥)
పసిఁడికుండలవంటి పంతపు చన్నులు నిన్ను
కొసరి యంగన కులుకుచుఁ గూడెను
యెసఁగి శ్రీ వేంకటేశ యిట్టె నీలాలనీమేను
మిసిమితోఁ బెనఁగఁగా మించులెల్లాఁ గప్పెను
(||pallavi||)
valabu liddarivini vannĕ kĕkkĕnu
saḽubula tamagamu sarivachchĕnu
(||valaba||)
mŏlaga mutyālavaṁṭi mŏnavām̐ḍi daṁtamula
kaligi nīgĕmmovi gaṁṭisesĕnu
balimi nīvu jaṁkiṁchi pagaḍālavaṁṭisūbu
siligiṁcham̐gānaṭṭe sĕlimenam̐ gappĕnu
(||valaba||)
mŏnamāṇigālavaṁṭi muluvām̐ḍigoḽḽa
vanida nī saṁdula vaṁkalŏttĕnu
sĕnagam̐gānīgŏppu sĕdari yābĕ pai niṁḍi
jinugunīlasīrayai siggulĕllām̐ gappĕnu
(||valaba||)
pasim̐ḍiguṁḍalavaṁṭi paṁtabu sannulu ninnu
kŏsari yaṁgana kulugusum̐ gūḍĕnu
yĕsam̐gi śhrī veṁkaḍeśha yiṭṭĕ nīlālanīmenu
misimidom̐ bĕnam̐gam̐gā miṁchulĕllām̐ gappĕnu