Valabu kolamdi gaadu vaddu vaddayyaa

వలపు కొలఁది గాదు వద్దు వద్దయ్యా
Language

(॥పల్లవి॥)
వలపు కొలఁది గాదు వద్దు వద్దయ్యా
చెలి కోపగించుకొంటే సేసేదేమయ్యా

(॥వలప॥)
వూడిగపుదాన నన్ను నొడివట్టి తీసేవు
యీడ నీపట్టిపుదేవి యేమి సేసునో
వేడుక యీవేళనైతే వెనక నాపె చిక్కించుఁ
కేడనైనాఁ బరచఁగ నేమిసేసేవయ్యా

(॥వలప॥)
దూతికె నింతే నేను తొడికేవు నాచన్నులు
కాతరించి నన్నెంత నీకాంత దూరునో
యేతులిప్పుడు సేసితే నింటికాడ వచ్చి యాపె
చేతులు చాఁచవచ్చితే చేరి యేమందునయ్యా

(॥వలప॥)
పరిచారకపుదానఁ బైకొని నన్నేలితివి
యిరవైనమగువ నన్నెట్టు నవ్వునో
సరుస శ్రీవేంకటేశ చలివాసి యిఁక నాపె
గరిసించితే మరి గతి నీవే అయ్యా

(||pallavi||)
valabu kŏlam̐di gādu vaddu vaddayyā
sĕli kobagiṁchugŏṁṭe sesedemayyā

(||valaba||)
vūḍigabudāna nannu nŏḍivaṭṭi tīsevu
yīḍa nībaṭṭibudevi yemi sesuno
veḍuga yīveḽanaide vĕnaga nābĕ sikkiṁchum̐
keḍanainām̐ barasam̐ga nemisesevayyā

(||valaba||)
dūdigĕ niṁte nenu tŏḍigevu nāsannulu
kādariṁchi nannĕṁta nīgāṁta dūruno
yedulippuḍu seside niṁṭigāḍa vachchi yābĕ
sedulu sām̐savachchide seri yemaṁdunayyā

(||valaba||)
parisāragabudānam̐ baigŏni nannelidivi
yiravainamaguva nannĕṭṭu navvuno
sarusa śhrīveṁkaḍeśha salivāsi yim̐ka nābĕ
garisiṁchide mari gadi nīve ayyā