Valabu gottaanam betti vanida lumdamgaam gada

వలపు గొట్టానఁ బెట్టి వనిత లుండఁగాఁ గడ
Language

(॥పల్లవి॥)
వలపు గొట్టానఁ బెట్టి వనిత లుండఁగాఁ గడ
నిలుచున్న మామీఁద నీకుఁ బరాకు

(॥వల॥)
పక్కనఁ గాఁకలు చల్లి పాయము లుట్టిపడఁగా
చెక్కు నొక్కి వేఁడుకొనీఁ జెలి నిన్ను
మొక్కుచు దవ్వులనుండి మొలకనవ్వులు నవ్వి
నిక్కి చూచె మాదిక్కే నీవు చూచే విదివో

(॥వల॥)
మాటలు మచ్చులు వేసి మానము నీ కొప్పగించి
కూటమికిఁ జెయి వట్టీఁ గొమ్మ నిన్ను
మేఁటిజణతనా లాడి మేడ లెక్కి తమ్మిమొగ్గ
వాటు వేసినంతలో నావస మైతివి

(॥వల॥)
బలిమిఁ గాఁగిలించి పయ్యద కొంగు జారి
కలసి లోలో మెచ్చీఁ గలికి నిన్ను
వెలినుండి నీవద్దకి వేళ చూడ వచ్చితేనే
వెలయఁ గూడితివి శ్రీవేంకటేశ నన్నును

(||pallavi||)
valabu gŏṭṭānam̐ bĕṭṭi vanida luṁḍam̐gām̐ gaḍa
nilusunna māmīm̐da nīgum̐ barāgu

(||vala||)
pakkanam̐ gām̐kalu salli pāyamu luṭṭibaḍam̐gā
sĕkku nŏkki vem̐ḍugŏnīm̐ jĕli ninnu
mŏkkusu davvulanuṁḍi mŏlaganavvulu navvi
nikki sūsĕ mādikke nīvu sūse vidivo

(||vala||)
māḍalu machchulu vesi mānamu nī kŏppagiṁchi
kūḍamigim̐ jĕyi vaṭṭīm̐ gŏmma ninnu
mem̐ṭijaṇadanā lāḍi meḍa lĕkki tammimŏgga
vāḍu vesinaṁtalo nāvasa maidivi

(||vala||)
balimim̐ gām̐giliṁchi payyada kŏṁgu jāri
kalasi lolo mĕchchīm̐ galigi ninnu
vĕlinuṁḍi nīvaddagi veḽa sūḍa vachchidene
vĕlayam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannunu