Valabu gorabu seya vadde yimta

వలపు గొరబు సేయ వద్దే యింత
Language

(॥పల్లవి॥)
వలపు గొరబు సేయ వద్దే యింత
యెలమిఁ జల పోరేవు యేమే నీవు

(॥వలప॥)
సంకె లేక యాతఁడు సారెఁ జేసేచేఁతలకు
వంకలొత్త వచ్చేవు వద్దే యింత
వుంకున నాపెనే వెంట నూడిగానకుఁ దిప్పఁగా
యింకాన న్నదియేవు యేమే నీవు

(॥వలప॥)
కాదని యాతనిఁ దారుకాణకు వేఁ బిలిచితే
వాదులాటకు వచ్చేవు వద్దే యింత
గోదిలి నావద్దఁ బేరుకొని యాపెఁ బిలువఁగ
యీదెస విను మనేవు యేమే నివు

(॥వలప॥)
శ్రీవేంకటేశ్వరుతోడఁ జేయి వట్టి పెనఁగఁగ
వావి దెలుప వచ్చేవు వద్దే యింత
కావించి యాతఁడూ నేనుఁ గలసితే నాపెచేత
నీవేళ మొక్కించ వచ్చే వేమే నీవు

(||pallavi||)
valabu gŏrabu seya vadde yiṁta
yĕlamim̐ jala porevu yeme nīvu

(||valaba||)
saṁkĕ lega yādam̐ḍu sārĕm̐ jesesem̐talagu
vaṁkalŏtta vachchevu vadde yiṁta
vuṁkuna nābĕne vĕṁṭa nūḍigānagum̐ dippam̐gā
yiṁkāna nnadiyevu yeme nīvu

(||valaba||)
kādani yādanim̐ dārugāṇagu vem̐ biliside
vādulāḍagu vachchevu vadde yiṁta
godili nāvaddam̐ berugŏni yābĕm̐ biluvam̐ga
yīdĕsa vinu manevu yeme nivu

(||valaba||)
śhrīveṁkaḍeśhvarudoḍam̐ jeyi vaṭṭi pĕnam̐gam̐ga
vāvi dĕluba vachchevu vadde yiṁta
kāviṁchi yādam̐ḍū nenum̐ galaside nābĕseda
nīveḽa mŏkkiṁcha vachche veme nīvu