Valabu gampalabetti vadi nemdaamkaa numdee

వలపు గంపలబెట్టి వడి నెందాఁకా నుండీ
Language

(॥పల్లవి॥)
వలపు గంపలబెట్టి వడి నెందాఁకా నుండీ
కలిగిన పాటే చాలు గాసిఁబెట్టనేలే

(॥వల॥)
మన సొక్కచో నుండఁగ మాఁటలాడఁబోతేను
వినఁ జవులౌనా వేసటౌఁగాక
యెనయ నెందుకో పోఁగా నింటికి రమ్మని నేఁ
బెనఁగితే నితవౌనా పెనుజోలి గాక

(॥వల॥)
యెదు రవ్వతెకో చూచేయీవేళ నేఁ బొలసితే
అది యింపౌనా గుండెబెదరవుఁగాక
కదిశొక్కతేఁ బిలువఁగా నేఁ బలికితేను
ముదమౌనా అది పెద్దమొగచాటౌఁగాక

(॥వల॥)
నాఁటినయాకెపై నవ్వు నామీఁదికిఁ దీసుకోఁగా
వాటఁమౌనా అది వేరే వగలౌఁగాక
యేఁటికి శ్రీవేంకటేశుఁడిదివో నన్నుఁగలసె
పూఁటపూఁట యిటులైతేఁ బొందులౌఁగాక

(||pallavi||)
valabu gaṁpalabĕṭṭi vaḍi nĕṁdām̐kā nuṁḍī
kaligina pāḍe sālu gāsim̐bĕṭṭanele

(||vala||)
mana sŏkkaso nuṁḍam̐ga mām̐ṭalāḍam̐bodenu
vinam̐ javulaunā vesaḍaum̐gāga
yĕnaya nĕṁdugo pom̐gā niṁṭigi rammani nem̐
bĕnam̐gide nidavaunā pĕnujoli gāga

(||vala||)
yĕdu ravvadĕgo sūseyīveḽa nem̐ bŏlaside
adi yiṁpaunā guṁḍĕbĕdaravum̐gāga
kadiśhŏkkadem̐ biluvam̐gā nem̐ baligidenu
mudamaunā adi pĕddamŏgasāḍaum̐gāga

(||vala||)
nām̐ṭinayāgĕbai navvu nāmīm̐digim̐ dīsugom̐gā
vāḍam̐maunā adi vere vagalaum̐gāga
yem̐ṭigi śhrīveṁkaḍeśhum̐ḍidivo nannum̐galasĕ
pūm̐ṭabūm̐ṭa yiḍulaidem̐ bŏṁdulaum̐gāga