Valabu daamsavachchunaa vadi nevvarigainaanu

వలపు దాఁచవచ్చునా వడి నెవ్వరికైనాను
Language

(॥పల్లవి॥)
వలపు దాఁచవచ్చునా వడి నెవ్వరికైనాను
కలకాలమును నిట్టె కాఁపురాలు సేయవే

(॥వల॥)
తనివారా నాతని దగ్గర గూచుండవే
గునియుచునేల సిగ్గున నుండేవు
మనసారా వొకమాటే మాఁటలెల్లా నాడవే
గొనకొని నీవేల గుక్కుకొనేవు

(॥వల॥)
కన్నులారాఁ దేరకొన గక్కనఁ జూడవే
సన్నలా చాయలా నేల జాలిగొనేవు
చన్నులారా నాతని చరణము నొత్తుకోవే
చెన్నుమీర లోలోనేల చిమ్మిరేఁగేవు

(॥వల॥)
చేతులారా వేడుకతో చేరి కాఁగిలించుకోవే
కాతరించి రతినేల కడుఁగొంకేవు
ఆతునూరాఁ గూడె నిన్ను నదె శ్రీవేంకటేశుఁడు
నాతో నెంత నీవు యిఁక నవ్వుతాఁ జెప్పేవు

(||pallavi||)
valabu dām̐savachchunā vaḍi nĕvvarigainānu
kalagālamunu niṭṭĕ kām̐purālu seyave

(||vala||)
tanivārā nādani daggara gūsuṁḍave
guniyusunela sigguna nuṁḍevu
manasārā vŏgamāḍe mām̐ṭalĕllā nāḍave
gŏnagŏni nīvela gukkugŏnevu

(||vala||)
kannulārām̐ deragŏna gakkanam̐ jūḍave
sannalā sāyalā nela jāligŏnevu
sannulārā nādani saraṇamu nŏttugove
sĕnnumīra lolonela simmirem̐gevu

(||vala||)
sedulārā veḍugado seri kām̐giliṁchugove
kādariṁchi radinela kaḍum̐gŏṁkevu
ādunūrām̐ gūḍĕ ninnu nadĕ śhrīveṁkaḍeśhum̐ḍu
nādo nĕṁta nīvu yim̐ka navvudām̐ jĕppevu