Valabu daamsaniyyadu vadi nettivaarinainaa

వలపు దాఁచనియ్యదు వడి నెట్టివారినైనా
Language

(॥పల్లవి॥)
వలపు దాఁచనియ్యదు వడి నెట్టివారినైనా
కలిగినదెల్లాను కంటిమి నీవల్లను

(॥వల॥)
వొప్పులుగా నాపె నీవు నొంటి నాడినమాటలు
చెప్పేవు చెలులతోడఁ జెలరేఁగి
చిప్పిల నీమీఁదఁ దాను చేసినగురుతు లెల్లా
చొప్పు లెత్తి కమ్మటిని చూపే వందరికి

(॥వల॥)
వొనర మీ రిద్దరును వుండేటివునుకులు
కనుసన్నఁ దెలిపేవు కాంతలకు
తనివోని వొండొరుల తలపోఁతల రతులు
ఘనముగా నప్పుడె లెక్కలు వెట్టేవు

(॥వల॥)
తగు నీదేవులజాణతనము లన్నియు నిట్టె
పొగడేవు నీవద్దిపొలఁతులతో
నగుతా శ్రీవేంకటేశ నన్ను నిట్టె యేలితివి
నిగిడి నీగుణమెల్లా నెరుపే విచ్చటను

(||pallavi||)
valabu dām̐saniyyadu vaḍi nĕṭṭivārinainā
kaliginadĕllānu kaṁṭimi nīvallanu

(||vala||)
vŏppulugā nābĕ nīvu nŏṁṭi nāḍinamāḍalu
sĕppevu sĕluladoḍam̐ jĕlarem̐gi
sippila nīmīm̐dam̐ dānu sesinagurudu lĕllā
sŏppu lĕtti kammaḍini sūbe vaṁdarigi

(||vala||)
vŏnara mī riddarunu vuṁḍeḍivunugulu
kanusannam̐ dĕlibevu kāṁtalagu
tanivoni vŏṁḍŏrula talabom̐tala radulu
ghanamugā nappuḍĕ lĕkkalu vĕṭṭevu

(||vala||)
tagu nīdevulajāṇadanamu lanniyu niṭṭĕ
pŏgaḍevu nīvaddibŏlam̐tulado
nagudā śhrīveṁkaḍeśha nannu niṭṭĕ yelidivi
nigiḍi nīguṇamĕllā nĕrube vichchaḍanu