Valabimchi tippevu vaadavaadalanu mammu

వలపించి తిప్పేవు వాడవాడలను మమ్ము
Language

(॥పల్లవి॥)
వలపించి తిప్పేవు వాడవాడలను మమ్ము
యిల గొంత గుట్టు వద్దా యేలోయి విట్ఠలా

(॥వల॥)
వొల్లనే మగలవద్దనున్న గొల్లెతలను
పిల్లఁగోవిసన్నలనే పిలిచేవు
చల్లలమ్మఁబోయ్యేచోట జాణతనా లాడేవు
బల్లిదుఁడ వౌదువయ్య పండరంగి విట్ఠలా

(॥వల॥)
వైపులఁ గొలనాడేటివారిచీరలు దీసి
రాఁపుచేసి నీవొద్దికి రప్పించేవు
యేపున వీదినుండితే యెలయించేవు చూపుల
బాపు బాపు మెచ్చితిఁగా పండరంగివిట్ఠలా

(॥వల॥)
కన్నచోట నెవ్వరైనాఁ గాంతలైతేఁ గూడేవు
చిన్ననాటనుండి యిటె చెనకేవు
యెన్నఁగ శ్రీవేంకటాద్రి నిటు నిట్ఠలాన మమ్ము
పన్నుక వుండి కూడితి పండరంగి విట్ఠలా

(||pallavi||)
valabiṁchi tippevu vāḍavāḍalanu mammu
yila gŏṁta guṭṭu vaddā yeloyi viṭṭhalā

(||vala||)
vŏllane magalavaddanunna gŏllĕdalanu
pillam̐govisannalane pilisevu
sallalammam̐boyyesoḍa jāṇadanā lāḍevu
ballidum̐ḍa vauduvayya paṁḍaraṁgi viṭṭhalā

(||vala||)
vaibulam̐ gŏlanāḍeḍivārisīralu dīsi
rām̐pusesi nīvŏddigi rappiṁchevu
yebuna vīdinuṁḍide yĕlayiṁchevu sūbula
bābu bābu mĕchchidim̐gā paṁḍaraṁgiviṭṭhalā

(||vala||)
kannasoḍa nĕvvarainām̐ gāṁtalaidem̐ gūḍevu
sinnanāḍanuṁḍi yiḍĕ sĕnagevu
yĕnnam̐ga śhrīveṁkaḍādri niḍu niṭṭhalāna mammu
pannuga vuṁḍi kūḍidi paṁḍaraṁgi viṭṭhalā