Valabimchamboyi neeve valasidivi

వలపించఁబోయి నీవే వలచితివి
Language

(॥పల్లవి॥)
వలపించఁబోయి నీవే వలచితివి
యిల నెంత జాణలకు నిట్టుండుఁ బనులు

(॥వల॥)
ఆఱడిఁ బెట్టి యాతని నాసలేల కొలిపే వే
జాఱుఁ గొప్పంతక చక్కఁ బెట్టవే
మీఱి మీఱి యప్పటిని మేలము లేమాడేవే
జోఱునఁ గారీఁ దుడుచుకొనవే చెమట

(॥వల॥)
మాఁటలఁ జొక్కించాతని మర్మమేల కరఁచేవే
గాఁటపు నీచీర లెన్స కట్టుకొనవే
నాఁటఁజూచి యాతని మనసెంత మరిగించేవే
పాటించి నీగుబ్బలపై పయ్యద గప్పుకోవే

(॥వల॥)
చేతుల చాఁచి యతని సిగ్గులేల వరచేవే
నీతలపులోని తమి నీవెంచుకోవే
యాతఁడే శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నునేలె
కాతరమేల రేఁచేవే కడుమోహించితివి

(||pallavi||)
valabiṁcham̐boyi nīve valasidivi
yila nĕṁta jāṇalagu niṭṭuṁḍum̐ banulu

(||vala||)
āṟaḍim̐ bĕṭṭi yādani nāsalela kŏlibe ve
jāṟum̐ gŏppaṁtaga sakkam̐ bĕṭṭave
mīṟi mīṟi yappaḍini melamu lemāḍeve
joṟunam̐ gārīm̐ duḍusugŏnave sĕmaḍa

(||vala||)
mām̐ṭalam̐ jŏkkiṁchādani marmamela karam̐seve
gām̐ṭabu nīsīra lĕnsa kaṭṭugŏnave
nām̐ṭam̐jūsi yādani manasĕṁta marigiṁcheve
pāḍiṁchi nīgubbalabai payyada gappugove

(||vala||)
sedula sām̐si yadani siggulela varaseve
nīdalabuloni tami nīvĕṁchugove
yādam̐ḍe śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnunelĕ
kādaramela rem̐seve kaḍumohiṁchidivi