వలపించఁబోయి నీవే వలచితి వతనికి
(॥పల్లవి॥)
వలపించఁబోయి నీవే వలచితి వతనికి
పలు(లి?)కించేనంటా నీవే పలికేవే కరఁగి
(॥వల॥)
కన్నుల నీవు చూచితే కాంతుఁడు గుఱియౌఁగాక
చన్నుమీఁదిపయ్యద జాఱనేఁటికే
సన్నలు నీవు సేపితే సమ్మతించుఁగా కతఁడు
చిన్ని చెమటలు నీమెయిఁ జిందనేఁటికే
(॥వల॥)
నీవు చేయి చాఁచితే నీవిభుఁడు లోనౌఁగాక
వేవేలకు నీకొప్పు వీడనేఁటికే
మోవి నీవు చూపితేను మొక్కి తాఁ జేకొనుఁగాక
ఆవేళను నీవు వెరగందనేఁటికే
(॥వల॥)
అంటితే శ్రీవేంకటేశుఁ డట్టె నిన్నుఁ గూడుఁగాక
పెంటపులకుల నీకుఁ బెరుగునేలే
జంటయై కూడితిరి నీచన వాతఁ డిచ్చుఁగాక
వెంటవెంట వచ్చి వచ్చి వేఁడుకొననేఁటికే
(||pallavi||)
valabiṁcham̐boyi nīve valasidi vadanigi
palu(li?)kiṁchenaṁṭā nīve paligeve karam̐gi
(||vala||)
kannula nīvu sūside kāṁtum̐ḍu guṟiyaum̐gāga
sannumīm̐dibayyada jāṟanem̐ṭige
sannalu nīvu sebide sammadiṁchum̐gā kadam̐ḍu
sinni sĕmaḍalu nīmĕyim̐ jiṁdanem̐ṭige
(||vala||)
nīvu seyi sām̐side nīvibhum̐ḍu lonaum̐gāga
vevelagu nīgŏppu vīḍanem̐ṭige
movi nīvu sūbidenu mŏkki tām̐ jegŏnum̐gāga
āveḽanu nīvu vĕragaṁdanem̐ṭige
(||vala||)
aṁṭide śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnum̐ gūḍum̐gāga
pĕṁṭabulagula nīgum̐ bĕrugunele
jaṁṭayai kūḍidiri nīsana vādam̐ ḍichchum̐gāga
vĕṁṭavĕṁṭa vachchi vachchi vem̐ḍugŏnanem̐ṭige