Valabemi vegadaa vanidalagu

వలపేమి వెగటా వనితలకు
Language

(॥పల్లవి॥)
వలపేమి వెగటా వనితలకు
చిలుకుగోళ్ళనేల చెమట చిమ్మేవే

(॥॥)
అదనెరిఁగి పచ్చిమాటాతఁడు నిన్నాడితేను
వదనకమల మేల వంచేవే
సదరానఁ గప్పురము చన్నుదాఁక వేసితేను
వుదుటున లోలోన వుసురనేవేలే

(॥॥)
చవులువుట్టిం చాతఁడు సన్న నీకుఁ జేసితేను
అవలివలై యేల అలసేవే
తివిరి యట్టె ముసుఁగు దీసి మోము చూచితే
జవళిఁ జొక్కుచు నేల జడిసేవే

(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జేరి కాఁగిలించితేను
భావము గరఁగి యెంత పదరేవే
కావరపునవ్వుతోడఁ గడుసరసమాడితే
చేవదేర నెంతకెంత చెలఁగేవే

(||pallavi||)
valabemi vĕgaḍā vanidalagu
silugugoḽḽanela sĕmaḍa simmeve

(||||)
adanĕrim̐gi pachchimāḍādam̐ḍu ninnāḍidenu
vadanagamala mela vaṁcheve
sadarānam̐ gappuramu sannudām̐ka vesidenu
vuduḍuna lolona vusuranevele

(||||)
savuluvuṭṭiṁ sādam̐ḍu sanna nīgum̐ jesidenu
avalivalai yela alaseve
tiviri yaṭṭĕ musum̐gu dīsi momu sūside
javaḽim̐ jŏkkusu nela jaḍiseve

(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri kām̐giliṁchidenu
bhāvamu garam̐gi yĕṁta padareve
kāvarabunavvudoḍam̐ gaḍusarasamāḍide
sevadera nĕṁtagĕṁta sĕlam̐geve