Valabemdum jallinaa vaddanaguve

వలపెందుఁ జల్లినా వద్దనకువే
Language

(॥పల్లవి॥)
వలపెందుఁ జల్లినా వద్దనకువే
చలిగాలి యొకచోట సతమయ్యీనా

(॥వల॥)
పైపై నీవిభుఁ డేపడఁతినో చూచెనంటా
కొపగించే వది యట్టే కొనసాగీనా
దీపించి మెఱుఁగులు దిక్కులెల్ల మెఱిచిన
రూపురేకై వొకచోట రూడికెక్కీనా

(॥వల॥)
కోరిక నెవ్వతెపైనో కూరిమి నించెనంటా
దూరె వాతని నవి తుదకెక్కీనా
కారుకమ్మేవానలోనఁ గడఁగి పుట్టినయట్టి -
నీరుబుగ్గ లొకచోట నిజమయ్యీనా

(॥వల॥)
శ్రీవేంకటేశుఁ డేచెలిఁ దొల్లి కూడెనంటాఁ
గావరించే వవి నీవు గంటివా నేడు
ఈవేళ నినుఁ గూడె నిట్టె పో భువిమీఁదఁ
బూవుఁ బరిమళము లెప్పుడు రెండవునా

(||pallavi||)
valabĕṁdum̐ jallinā vaddanaguve
saligāli yŏgasoḍa sadamayyīnā

(||vala||)
paibai nīvibhum̐ ḍebaḍam̐tino sūsĕnaṁṭā
kŏbagiṁche vadi yaṭṭe kŏnasāgīnā
dībiṁchi mĕṟum̐gulu dikkulĕlla mĕṟisina
rūburegai vŏgasoḍa rūḍigĕkkīnā

(||vala||)
koriga nĕvvadĕbaino kūrimi niṁchĕnaṁṭā
dūrĕ vādani navi tudagĕkkīnā
kārugammevānalonam̐ gaḍam̐gi puṭṭinayaṭṭi -
nīrubugga lŏgasoḍa nijamayyīnā

(||vala||)
śhrīveṁkaḍeśhum̐ ḍesĕlim̐ dŏlli kūḍĕnaṁṭām̐
gāvariṁche vavi nīvu gaṁṭivā neḍu
īveḽa ninum̐ gūḍĕ niṭṭĕ po bhuvimīm̐dam̐
būvum̐ barimaḽamu lĕppuḍu rĕṁḍavunā