Valabellaa raasivade vanidi vemdugoneeni

వలపెల్లా రాసివడే వనితి వేఁడుకొనీని
Language

(॥పల్లవి॥)
వలపెల్లా రాసివడే వనితి వేఁడుకొనీని
చల మేల సాదించేవు చన వియ్యవయ్యా

(॥॥)
మాటలఁ దేనెలు గారీ మగువకు నీ యెదుట
కోటిసేయఁ బెట్టి నట్టి కొప్పు జారీని
వూటలుగాఁ బెం జెమట లూరీని మేన నెల్లా
యేఁటికి నలయించేవు యియ్యకొనవయ్యా

(॥॥)
చెక్కిళ్ళ జవ్వాది చిందె చేరి నీకు మొక్కఁగాను
గక్కన గుబ్బలు రాసీ కసుగందిని
తక్కక నిన్నుఁ జూచి సంతస మంది మదిలోని
తక్కుల నేల పెట్టేవు దయసేయవయ్యా

(॥॥)
నెమ్మిఁ బోఁకముడి వీడీని కొలువు సేయఁగాను
చిమ్ముఁ జెనకుల చేత సిగ్గు లూఁదీని
నెమ్మది శ్రీ వేంకటేశ నీ వింతలో నేలితివి
సమ్మతాయ నిటులానే సమకూడ వయ్యా

(||pallavi||)
valabĕllā rāsivaḍe vanidi vem̐ḍugŏnīni
sala mela sādiṁchevu sana viyyavayyā

(||||)
māḍalam̐ denĕlu gārī maguvagu nī yĕduḍa
koḍiseyam̐ bĕṭṭi naṭṭi kŏppu jārīni
vūḍalugām̐ bĕṁ jĕmaḍa lūrīni mena nĕllā
yem̐ṭigi nalayiṁchevu yiyyagŏnavayyā

(||||)
sĕkkiḽḽa javvādi siṁdĕ seri nīgu mŏkkam̐gānu
gakkana gubbalu rāsī kasugaṁdini
takkaga ninnum̐ jūsi saṁtasa maṁdi madiloni
takkula nela pĕṭṭevu dayaseyavayyā

(||||)
nĕmmim̐ bom̐kamuḍi vīḍīni kŏluvu seyam̐gānu
simmum̐ jĕnagula seda siggu lūm̐dīni
nĕmmadi śhrī veṁkaḍeśha nī viṁtalo nelidivi
sammadāya niḍulāne samagūḍa vayyā