Valabela daamseve vanida neevu

వలపేల దాఁచేవే వనిత నీవు
Language

(॥పల్లవి॥)
వలపేల దాఁచేవే వనిత నీవు
తిలకించి యెంత తరితీపు సేసేవే

(॥॥)
పలుమారు నాతఁడు బాఁతిపడి పిలువఁగా
వోలసీనొల్లమి నేల వూఁకొనేవే
బలిమి నాతఁడు నీకు పచ్చడము గప్పఁగాను
అలరి వొయ్యారాన నట్టె లోనయ్యేవే

(॥॥)
చిమ్మిరేఁగి యాతఁడు చేసన్న సేయఁగాను
వుమ్మడిజాగుతోనేల వొద్దికయ్యేవే
నెమ్మితోడ నాతఁడు నీకు విడెమియ్యఁగాను
చిమ్ముల మెల్లనే యొట్టు చేయిచాఁచేవే

(॥॥)
అట్టె శ్రీ వేంకటేశుఁడు అంకెఁ గాఁగిలించుకోఁగా
గుట్టునఁగరఁగి యెంత గుబ్బతిల్లేవే
యిట్టె యాతఁడు నిన్ను నేలి నేఁడు మన్నించఁగా
దిట్టవై యలసి యేమి తేలించి చూచేవే

(||pallavi||)
valabela dām̐seve vanida nīvu
tilagiṁchi yĕṁta taridību seseve

(||||)
palumāru nādam̐ḍu bām̐tibaḍi piluvam̐gā
volasīnŏllami nela vūm̐kŏneve
balimi nādam̐ḍu nīgu pachchaḍamu gappam̐gānu
alari vŏyyārāna naṭṭĕ lonayyeve

(||||)
simmirem̐gi yādam̐ḍu sesanna seyam̐gānu
vummaḍijāgudonela vŏddigayyeve
nĕmmidoḍa nādam̐ḍu nīgu viḍĕmiyyam̐gānu
simmula mĕllane yŏṭṭu seyisām̐seve

(||||)
aṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍu aṁkĕm̐ gām̐giliṁchugom̐gā
guṭṭunam̐garam̐gi yĕṁta gubbadilleve
yiṭṭĕ yādam̐ḍu ninnu neli nem̐ḍu manniṁcham̐gā
diṭṭavai yalasi yemi teliṁchi sūseve